Rebel Star Prabhas
Rebel Star Prabhas : రెబెల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas) కి ప్రభోద్ అనే అన్నయ్య, ప్రగతి అనే సోదరి ఉన్న సంగతి తెలిసిందే. ప్రభోద్ యూవీ క్రియేషన్స్(UV creations) స్థాపించి ఇండస్ట్రీ లో అగ్రనిర్మాతగా కొనసాగుతున్నాడు. భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ సినిమాలు చేస్తూ ఎప్పుడూ ఫుల్ బిజీ గా ఉంటాడు కానీ, లో ప్రొఫైల్ ని మైంటైన్ చేయడానికే ఎక్కువ మొగ్గు చూపిస్తుంటాడు, బయట ఎక్కువగా కనిపించిన దాఖలాలు లేవు. ఇక సోదరి ప్రగతి సినీ ఇండస్ట్రీ కి దూరంగా ఉంటూ, పెళ్లి చేసుకొని జీవితంలో స్థిరపడిపోయింది. ఇదంతా పక్కన పెడితే ప్రభాస్ తన పెద్దనాన్న కృష్ణం రాజు(Krishnam Raju) ని కూడా సొంత నాన్న లాగానే బావిస్తుంటాడు. ఆయనపై ప్రభాస్ చూపించే వెలకట్టలేని ప్రేమ ఎలాంటిదో మనమంతా కళ్లారా చూసాము. ఆయన చనిపోయినప్పుడు ప్రభాస్ తన సొంతూరు మొగళ్తూరు మొత్తానికి భోజనాలు ఏర్పాటు చేయడం అప్పట్లో సంచలనంగా మారింది.
కృష్ణం రాజు గారు శ్యామలాదేవి ని పెళ్లాడిన సంగతి అందరికీ తెలిసిందే. ఆమెకు ప్రసీద, ప్రదీప్తి, ప్రకీర్తి అని ముగ్గురు కూతుర్లు ఉన్నారు. వీళ్ళను ప్రభాస్ తన సొంత చెల్లెళ్లుగానే బావిస్తుంటాడు. వాళ్ళ బాధ్యతలను కూడా తన భుజాన వేసుకున్నాడు ప్రభాస్. ఇటీవల వీళ్లంతా కలిసి ఒక పెళ్లి వేడుకలో పాల్గొనగా, ఆ పెళ్లి వేడుకలో వీళ్లకు సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియా లో లీకై బాగా వైరల్ అయ్యింది. ఈ ఫోటో ని చూసిన తర్వాత అభిమానులు ‘ఎంతసేపు పెళ్లీళ్లకు వెళ్లడమేనా..? ప్రభాస్ కి ఎప్పుడు పెళ్లి చేస్తారు?’ అంటూ అడుగుతున్నారు. త్వరలోనే ప్రభాస్ మొగళ్తూరు గ్రామానికి చెందిన అమ్మాయిని పెళ్లాడబోతున్నాడని ఆయన స్నేహితుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘అన్ స్టాపబుల్ షోలో చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది లోనే ప్రభాస్ ఒక ఇంటి వాడు అవ్వబోతున్నాడు అనేది మాత్రం కాదనలేని నిజం, త్వరలో ఆయన ఎవరిని పెళ్లాడబోతున్నాడు అనేది తెలియనుంది.
ఇక ఆయన సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం డైరెక్టర్ మారుతీ తో కలిసి ‘రాజా సాబ్'(The RaajaSab Movie) అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ కార్యక్రమాలు దాదాపుగా పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్ 10 న విడుదల కావాల్సి ఉంది. కానీ ప్రభాస్ కాళ్లకు గాయాలు అవ్వడంతో ఈ సినిమా షూటింగ్ నిలిచిపోయింది. ఇప్పటికీ ప్రభాస్ విదేశాల్లోనే విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఏడాదికి రెండు సినిమాలు చేస్తూ వచ్చిన ప్రభాస్, ఈ ఏడాది కేవలం ‘రాజా సాబ్’ తోనే సరిపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఈ చిత్రాన్ని దసరా కి విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. ఈ చిత్రంతో పాటు ఆయన హను రాఘవపూడి చిత్రం కూడా చేస్తున్నాడు. ఇండియా కి తిరిగి రాగానే ఈ రెండు సినిమాల షూటింగ్స్ లో సమాంతరంగా పాల్గొనబోతున్నాడు ప్రభాస్. హను రాఘవపూడి తో చేస్తున్న మూవీ వచ్చే ఏడాది లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.