Tammareddy Bharadwaja- Vijay Devarakonda: లైగర్ ఫెయిల్యూర్ లో విజయ్ దేవరకొండకు కూడా భాగం ఉంది. ఆయన ఓవర్ యాటిట్యూడ్ సినిమా ఫలితాన్ని దారుణంగా దెబ్బతీసిందని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నారు. తాజాగా సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ ఇదే అభిప్రాయం వెల్లడించారు. ఓ రేంజ్ లో ఆయన విజయ్ దేవరకొండను ఏకిపారేశారు. ఎగిరెగిరి పడితే ఇలాంటి ఎదురు దెబ్బలే తగులుతాయి అన్నారు. మేము సినిమాను ఎంతో కష్టపడి తీశాము, చూసి ఆదరించండని ప్రేక్షకుల్లో సినిమాను ప్రమోట్ చేసుకోవాలి. లేదని పొగరుతో చిటికెలు వేస్తే ఫలితాలు ఇలానే ఉంటాయని హితవు పలికారు.

ఇక పూరి జగన్నాధ్ కి కూడా తమ్మారెడ్డి చురకలు అంటించారు. పూరి జగన్నాధ్ అంటే నాకు చాలా ఇష్టం, ఆయన అభిమానిని నేను. అయితే లైగర్ ట్రైలర్ చూశాక సినిమా చూడాలి అనిపించలేదు. భవిష్యత్ లో మళ్ళీ ఆయన సినిమాలు చూడొచ్చు అన్నారు. ఇక సోషల్ మీడియా ప్రభావం పెరిగాక బాయ్ కాట్ ట్రెండ్ ఎక్కువయ్యింది అన్నారు. ఇలాంటివి ట్రెండ్ చేసేవాళ్లకు పెద్దగా సినిమాలు చూసే అలవాటు కూడా ఉండదు. కాబట్టి ఈ బాయ్ కాట్ ట్రెండ్స్ పట్టించుకోకపోతే మంచిది అంటూ తమ్మారెడ్డి అభిప్రాయపడ్డారు.
Also Read: Chiranjeevi- Nagababu: చిరంజీవి, నాగబాబు అడ్డంగా దొరికిపోయారట.. ఏమిటా కథ?
విజయ్ దేవరకొండను ఉద్దేశిస్తూ తమ్మారెడ్డి చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యాయి. ముంబైకి చెందిన థియేటర్స్ యజమాని మనోజ్ దేశాయ్ సైతం ఇదే అభిప్రాయాన్ని వెల్లడించారు. విజయ్ దేవరకొండ యాటిట్యూడ్ సినిమా ఓపెనింగ్స్ ని భారీగా దెబ్బతీసింది అన్నారు. నా సినిమాను కావాలంటే బాయ్ కాట్ చేయండి, అని విజయ్ దేవరకొండ చెప్పడం అడ్వాన్స్ బుకింగ్స్ పై ప్రభావం చూపింది. విజయ్ దేవరకొండ ఓ అనకొండ అంటూ తిట్టిపోశాడు. లైగర్ మూవీపై ఎన్నో ఆశలు పెట్టుకుంటే మొత్తం నాశనం చేశాడని మీడియా ముందు గగ్గోలు పెట్టారు.

అన్ని తిట్టినా మనోజ్ దేశాయ్ ని స్వయంగా కలిసిన విజయ్ దేవరకొండ క్షమాపణలు చెప్పారు. సినిమా వసూళ్ల కోసం మరింతగా ప్రమోషన్స్ చేస్తానని హామీ ఇచ్చాడు. లైగర్ ప్రమోషన్స్ లో యూత్ నుండి భారీ రెస్పాన్స్ దక్కింది. మూవీ విజయం సాధించడం ఖాయమని భావించిన విజయ్ కొంచెం పొగరు చూపించారు. హైదరాబాద్ ప్రెస్ మీట్ లో ఆయన టేబుల్ పై కాళ్ళు పెట్టుకొని విలేకర్ల ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఇవన్నీ వెరసి ఒక నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేశాయి.
Also Read:Taj Mahal Renamed: తాజ్ మహల్ పేరు మారబోతోందా?
https://www.youtube.com/watch?v=6AoeUJSSVKQ
[…] […]
[…] […]
[…] […]
[…] […]