Vikram On Chiranjeevi: సినిమా ఇండస్ట్రీని దాదాపు 40 సంవత్సరాల నుంచి ఏకచత్రాధిపత్యంతో ఏలుతున్న ఒకే ఒక హీరో మెగాస్టార్ చిరంజీవి. ఈయన ప్లేస్ ని రీప్లేస్ చేసే హీరో ఇప్పటివరకు ఇండస్ట్రీకి ఇంకా దొరకలేదు అని అనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు, ఆయన డ్యాన్సులు వేస్తూ, ఫైట్లు చేస్తూ ఏ పాత్రనైనా అలవోకగా చేసి మెప్పించే నటుడు కావడం విశేషం.
ఇక ఇప్పటి వరకు ఈయన లాంటి నటుడు ఇండస్ట్రీలో లేడు. స్టార్ హీరోలు చాలా మంది ఉన్నప్పటికీ అన్నీ కలగలిపిన హీరో ఇప్పటివరకు ఇండస్ట్రీలు ఒక్కరూ కూడా కనిపించలేదు. ఒక్కో హీరో లో ఒక్కో స్పెషాలిటీ ఉంది అంతే తప్ప చిరంజీవిలాగా అన్ని కలిసి ఉన్న ఒక్క హీరో కూడా ఇండస్ట్రీలో లేకపోవడంతో మెగాస్టార్ చిరంజీవి ప్లేస్ ఇప్పటికి అలాగే ఖాళీగానే ఉండిపోయింది. ఇక మెగాస్టార్ చిరంజీవి అంటే నార్మల్ జనాలతో పాటు సినిమా హీరోల్లో కూడా ఆయనకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన అభిమానులుగా మారి సినిమా హీరోలు అయిన వాళ్లు కూడా చాలామంది ఉన్నారు. అయితే చిరంజీవి సినిమాలో ఒక్క చిన్న పాత్ర అయిన సరే చేయడానికి రెఢీ గా ఉన్న హీరోలు చాలా మంది ఉన్నారు. ఇక కొందరైతే దాన్ని డ్రీమ్ గా పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు ఇక లాంటి వాళ్లలో స్టార్ హీరో విక్రమ్ కూడా ఒకరు.
ఈయన చిరంజీవి సినిమాల్లో నటించాలని చాలా ఉత్సాహాన్ని చూపిస్తున్నాడు. కానీ ఆయన తగ్గ పాత్ర దొరకకపోవడంతో ఎవరు కూడా ఆయన్ని సంప్రదించడం లేదు. కానీ ఆయనకి మాత్రం చిరంజీవి తో నటించాలని ఉందని రీసెంట్ గా ఒక సందర్భంలో తెలియజేశారు. ఆయన లైఫ్ టైమ్ లో చిరంజీవితో ఒక చిన్న పాత్రలో అయిన స్క్రీన్ షేర్ చేసుకోవాలని అనుకుంటున్నట్టుగా చెప్పాడు. ఇక మొత్తానికైతే విక్రమ్ చిరంజీవితో కనిపించే అవకాశాలు తొందరలోనే ఉండబోతున్నాయనే వార్తలైతే వస్తున్నాయి.
నిజానికి విక్రమ్ కూడా చాలా మంచి నటుడు ఆయనకు సరిపడా పాత్ర దొరకడం లేదు గానీ అలాంటి పాత్ర దొరికితే మాత్రం సినిమా చూసే ప్రేక్షకుడికి తన నటనతో పిచ్చెక్కిస్తాడు. అలాంటి నటనని చూపించే విక్రమ్ ఎప్పుడు వైవిధ్యమైన పాత్రలు ఎంచుకోవడంలో ముందుంటాడు. ఒకసారి చేసిన పాత్రను మరోసారి చేయడానికి తను ఇష్టపడడు. అందుకే ఏదైనా కొత్త కథ రాసుకున్నప్పుడు డైరెక్టర్లు మొదట గా విక్రమ్ దగ్గరికి వెళ్లి కథ వినిపిస్తూ ఉంటారు…ఇక రీసెంట్ టైమ్ లో చిరంజీవి, విక్రమ్ కాంబినేషన్ లో ఏదైనా సినిమా వస్తుందేమో చూడాలి…