https://oktelugu.com/

Chiranjeevi: చిరంజీవి మాస్టర్ సినిమాలో చేసిన ఆ ఒక్క మిస్టేక్ ను మళ్లీ రిపీట్ చేయలేదా..? ఇంతకీ ఆయన ఏం చేశారంటే..?

సినిమా ఇండస్ట్రీ లో రారాజు గా వెలుగొందుతూ, తన సినిమాలతో బాక్సాఫీస్ రికార్డ్స్ ను షేక్ చేసే స్టార్ హీరో చిరంజీవి. అప్పటికి ఇప్పటికి ఆయనలో ఎలాంటి మార్పు లేదు...

Written By:
  • Mahi
  • , Updated On : September 17, 2024 / 10:46 AM IST

    Chiranjeevi(8)

    Follow us on

    Chiranjeevi: తెలుగు చలన చిత్ర సీమలో నందమూరి తారక రామారావు గారి తర్వాత అంతటి ఘన కీర్తిని సాధించుకున్న వాళ్ళలో మెగాస్టార్ చిరంజీవి ఒకరు… ఈయన చేసిన సినిమాలకి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడమే కాకుండా మొదటి షో చిరంజీవి సినిమా చూడకపోతే అసలు ఏ మాత్రం కిక్ ఉండదు. అనే విధంగా అప్పటి తెలుగు యువత చిరంజీవి కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా మొదటిరోజు సినిమా చూసి తీరే వాళ్ళు… అలాంటి ప్రేక్షక అభిమానులను సంపాదించుకున్న చిరంజీవి తన ఎంటైర్ కెరీర్ లో ఎన్నో అద్భుతమైన చిత్రాలను చేసి ప్రేక్షకులందరిని కాలర్ ఎగరేసేలా చేశాడు అలాగే మిగతా ఇండస్ట్రీలో నుంచి ఎదురయ్యే పోటీని కూడా తనే స్వయంగా స్వీకరించి తెలుగు సినిమా ఇండస్ట్రీని టాప్ లెవెల్లో నిలిపే ప్రయత్నం చేశాడు. ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ మెగాస్టార్ చిరంజీవి హీరోగా సాక్షి శివానంద్ హీరోయిన్ గా వచ్చిన ‘మాస్టర్ ‘ సినిమాలో చిరంజీవి ఒక మిస్టేక్ అయితే చేశాడు. అది ఏంటి అంటే చిరంజీవి ఈ సినిమాలో కాలేజీలో లెక్చరర్ గా పని చేస్తూ ఉంటాడు. ఇక ఇలాంటి క్రమంలోనే స్టూడెంట్స్ ని మంచి దారిలో పెట్టాల్సిన చిరంజీవి అన్ని రకాలుగా స్టూడెంట్స్ కి మోరల్ సపోర్ట్ ని అందిస్తాడు.

    అలాగే రౌడీల చేతుల్లో చిక్కుకున్న కొంత మంది స్టూడెంట్స్ ని మార్చే ప్రయత్నం కూడా చేస్తుంటాడు. ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ చిరంజీవి మాస్టర్ పాత్రను పోషించాడు. ఇక సిగరెట్ తాగకూడదు అని చెప్పాల్సిన తనే సిగరెట్స్ తాగుతూ ఉంటాడు. ఇప్పుడంటే డాక్టర్లతో సహా చాలామంది సిగరెట్లు తాగుతున్నారు. నిజానికి ఒకప్పుడు సిగరెట్ తాగడం అంటే అదొక పెద్ద నేరంగా పరిగణించేవారు.

    నలుగురికి చెప్పాల్సిన మనిషి సిగరెట్ తాగుతున్నాడు అంటే ఆ వ్యక్తి మీద ఎంతో కొంత రెస్పెక్ట్ అనేది తగ్గిపోతూ ఉండేది. కాబట్టి చిరంజీవి ఈ సినిమాలో చేసిన పాత్రకి ఇలాంటి బ్యాడ్ హాబిట్స్ ఉండటంతో అప్పట్లో దీని మీద కొంత నెగిటివిటి అయితే సంతరించుకుంది. ఈ విషయాన్ని అబ్జర్వ్ చేసిన ఆయన తన తదుపరి సినిమాల్లో ఆయన చేసే క్యారెక్టర్ తాలూకు ఇంపార్టెన్స్ ని అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగానే మెదులుతూ వచ్చాడు…నిజానికి ఇప్పుడు ఉన్న సిచ్యూవేషన్ లో ప్రతి ఒక్కరూ తమ టెన్షన్స్ ను తగ్గించుకోవడానికి సిగరెట్ అనేది తాగుతున్నారు.

    కానీ ఒకప్పుడు గొప్ప పొజిషన్ లో ఉన్నవారు ఇలా చేయడాన్ని చాలా మంది జనాలు జీర్ణించుకునేవాళ్ళు కాదు. ఇక ఇప్పుడంటే బ్రాడ్ మైండ్ తో ఆలోచించే ప్రేక్షకులు ఉన్నారు. కానీ అప్పుడు చిన్న చిన్న వాటికి కూడా తమ హీరో ఎందుకిలా చేశాడు అంటూ అభిమానులు చాలా తీవ్రంగా బాధపడుతుండేవారు…