Rajamouli- Mahesh Babu Movie: టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన వాళ్లు ఒక్కసారైనా రాజమౌళి సినిమాలో నటించాలని కోరుకుంటారు. ఆ ఛాన్స్ వస్తే ఇక తమ దశ తిరుగుతుందని భావిస్తారు. పాన్ ఇండియా లెవల్లో పేరు తెచ్చుకున్న ఆయన సినిమాల్లో ఇతర ఇండస్ట్రీకి చెందిన నటులు కూడా అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో జక్కన్న నెక్ట్స్ మూవీ కోసం ఓ తమిళ హీరోను సంప్రదించాడట. ఆయన ఓకే చెప్పాడా..? లేదా..? అనేది తెలియదు. కానీ రాజమౌళి సినిమా అంటే ఎవరూ కాదనరు.

‘ఆర్ఆర్ఆర్’ తరువాత రాజమౌళి కాస్త గ్యాప్ తీసుకొని మహేశ్ తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. జక్కన తండ్రి విజయేంద్రప్రసాద్ అందుకు సంబంధించిన కథను రెడీ చేస్తున్నాడట. ఇంతలోనే ఓ షాకింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ సినిమాలో మహేశ్ తో పాటు తమిళ స్టార్ హీరో కూడా కనిపిస్తాడట. ఆయనను ఇటీవల ఇంటికెళ్లి మరీ కలిశారట. తమిళంలో కొన్ని సినిమాలతోనే సూపర్ స్టార్ పేరు తెచ్చుకున్న కార్తీ తెలుగువారికి సుపరిచితుడే. ఈయన తమిళ సినిమాలన్నీ తెలుగులో రిలీజ్ కావడంతో ఇక్కడివారూ ఆయనను ఆదరిస్తున్నారు. దీంతో ఆయన నేరుగా తెలుగులో కూడా నాగార్జునతో కలిసి ‘ఊపిరి’ సినిమా చేశాడు. ఆ తరువాత మళ్లీ కోలీవుడ్ లో బిజీ అయిన కార్తీ మరో తెలుగు సినిమాలో నటించనున్నట్లు తెలుస్తోంది.

రాజమౌళి నెక్ట్స్ సినిమా మహేశ్ తో తీస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించాడు. ఇది ఆయన కెరీర్లోనే బిగ్ మూవీగా ఉండనుందట. ప్రపంచాన్ని చుట్టి వచ్చే ఓ ధీరుడి గురించి సినిమా ఉంటుందట. అందుకు సంబంధించిన స్క్రిప్ట్ రెడీ అవుతోంది. ఈ క్రమంలో సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు అప్పుడే మొదలుపెట్టారు. ఇందులో మహేశ్ తో పాటు కార్తీని కూడా పెట్టాలని అనుకున్నారట. ఇందులో భాగంగా ఆయనను కలిసినట్లు సమాచారం.
కానీ ఈ విషయాన్ని అటు కార్తీ గానీ.. ఇటు రాజమౌళి గానీ అధికారికంగా ప్రకటించలేదు. ఒకవేళ ఈ సినిమాలో కార్తీ ఉంటే మల్టీ స్టారర్ మూవీగా మరోసారి రాజమౌళి ప్రభంజనం సృష్టించనున్నాడు. రాజమౌళి తీసే ప్రతీ సినిమాలో ఇతర ఇండస్ట్రీకి చెందిన ఓ ప్రముఖ నటుడు ఉంటారు. ఆర్ఆర్ఆర్ లో బాలీవుడ్ కు చెందిన ఇద్దరు నటులు ఉన్నారు. ఈసారి మాత్రం తమిళ హీరో కార్తిని చూజ్ చేసుకున్నట్లు తెలుస్తోంది.