https://oktelugu.com/

Balam Movie: “బలం” గా రానున్న తమిళ స్టార్ హీరో అజిత్…

Balam Movie: తమిళ్ స్టార్ హీరో అజిత్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అజిత్ నటించిన పలు చిత్రాలు తెలుగులో కూడా డబ్ అయ్యి సూపర్ హిట్ గా నిలిచాయి. కాగా అజిత్ ప్రస్తుతం హెచ్. వినోద్ దర్శకత్వంలో ‘వాలిమై’ అనే చిత్రంలో నటిస్తున్నారు. కోలీవుడ్ నిర్మాణ సంస్థ బే వ్యూ ప్రాజెక్ట్స్.. జీ స్టూడియోస్ సహకారంతో ప్రముఖ నిర్మాత బోనీకపూర్‌ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. కరోనా కారణంగా వాయిదా […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 26, 2021 / 03:03 PM IST
    Follow us on

    Balam Movie: తమిళ్ స్టార్ హీరో అజిత్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అజిత్ నటించిన పలు చిత్రాలు తెలుగులో కూడా డబ్ అయ్యి సూపర్ హిట్ గా నిలిచాయి. కాగా అజిత్ ప్రస్తుతం హెచ్. వినోద్ దర్శకత్వంలో ‘వాలిమై’ అనే చిత్రంలో నటిస్తున్నారు. కోలీవుడ్ నిర్మాణ సంస్థ బే వ్యూ ప్రాజెక్ట్స్.. జీ స్టూడియోస్ సహకారంతో ప్రముఖ నిర్మాత బోనీకపూర్‌ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోన్న ఈ చిత్రం ఎట్టకేలకు జనవరి 13న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. అజిత్ కు ఉన్న క్రేజ్ దృష్ట్యా తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లోనూ సినిమాను విడుదల చేయడానికి మూవీ మేకర్స్ సిద్ధమవుతున్నారు.

    ఈ మేరకు తెలుగు, తమిళ భాషల్లో డబ్బింగ్ వెర్షన్ ను విడుదల చేయాలనుకుంటున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన తెలుగు టైటిల్ ను రివీల్ చేశారు మూవీ యూనిట్. ‘వాలిమై’ చిత్రానికి తెలుగులో ‘బలం’ అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ ఒక పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. తమిళంలో ఈ చిత్రం జనవరి 13న విడుదల కానుండగా… తెలుగులో రిలీజ్ డేట్ ఇంకా కన్ఫర్మ్ కాలేదని సమాచారం. కాగా ఈ సినిమాలో టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ విలన్‌గా నటిస్తుండడం మరో ప్రత్యేక ఆకర్షణ అని చెప్పాలి. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.

    పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాలో హుమా ఖురేషి, యోగి బాబుతో పాటు పలువురు కీలక పాత్రల్లో నటించారు. కాగా ఈ సినిమాలో బైక్ రేసర్ గా కనిపించనున్నాడు అజిత్‌. ఇటీవల విడుదలైన తలా బైక్‌ స్టంట్ల వీడియోలు అభిమానులను బాగా ఆకట్టుకున్నాయి. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానున్న ఈ సినిమాపై అజిత్ అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్‌ డైరెక్టర్‌ యువన్‌ శంకర్‌ రాజా స్వరాలు సమకూరుస్తున్నారు.