PM Modi: దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఒకే చోట 10 ఒమిక్రాన్ కేసులు వెలుగుచూస్తే హాట్ స్పాట్ సెంటర్‌గా మార్చాలని కేంద్ర ఆరోగ్యశాఖ నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చా యి. అయితే, కేంద్రం ఆదేశాలను రాష్ట్రాలు సీరియస్‌గా తీసుకున్నట్టు కనిపించడం లేదు. జనాలు విచ్చలవిడిగా రోడ్లపై సంచరిస్తున్నారు. పార్టీలు, పండుగలు, ఫంక్షన్ల పేరుతో గుంపులుగుంపులుగా సంచరిస్తున్నారు. కొవిడ్ రూల్స్ పాటించడం లేదు. ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తున్న వేళ మాస్కులు ధరించకుండా తిరిగే వారిపై రాష్ట్ర ప్రభుత్వాలు కొరడా ఝలిపిస్తున్నాయి. రూ. వెయ్యి జరిమానా వసూలు చేస్తున్నాయి. అయినా కూడా జనాల్లో ఒమిక్రాన్ పట్ల ఏమాత్రం భయం కనిపించడం లేదు.

టెన్షన్ పెట్టిన ప్రధాని..
ప్రధాని మోడీ శనివారం రాత్రి ఉన్నట్టుండి జాతినుద్దేశించి ప్రసంగించారు. అంతకుముందు ప్రధాని అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ నుంచి జాతినుద్దేశించి మోడీ ప్రసంగం చేయనున్నారని ట్వీట్ వెలువడిండి. దీంతో దేశప్రజలు కొంత గందరగోళానికి గురయ్యారట.. మళ్లీ లాక్‌డౌన్ విధిస్తారేమో అని కొందరు ఏటీఎం సెంటర్ల వద్దకు పరుగులు తీస్తే మరికొందరు రాత్రిరాత్రి షాపింగులు చేసేశారట.. తీరా చూస్తే ప్రధాని ప్రసంగంలో ఎక్కడా లాక్‌డౌన్ గురించి గానీ నైట్ కర్ఫ్యూ గురించి ప్రస్తావన రాలేదు. కరోనా టైంలో వైద్యులు, ఫ్రంట్ లైన్ వర్కర్స్ చాలా అద్భుతంగా పనిచేశారని కితాబిచ్చారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్ నాలుగో దశ నడుస్తోందన్నారు. ఇప్పటికే దేశంలో వందకోట్ల మందికి ఫస్ట్ డోస్ పూర్తి చేశామన్నారు.
Also Read: ఏడాదిలో ఎంత తేడా: సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణతో సీఎం జగన్ కలిసిన సందర్భం..!
పిల్లలకు టీకా..
ప్రధానిమోడీ ప్రసంగంలో ఒమిక్రాన్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెబుతూనే మరోవైపు 12 నుంచి 18లోపు వారికి వ్యాక్సినేషన్ ఇవ్వనున్నట్టు ప్రకటించారు. అంతేకాకుండా 60ఏళ్లకు పైబడిన వారికి ప్రికాషన్ డోస్ (బూస్టర్ డోస్) ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. జనవరి 3 నుంచి ఈ ప్రక్రియను ప్రారంభించనున్నట్టు పేర్కొన్నారు. వీలైనంత త్వరగా వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని, మాస్కు లేకుండా బయట తిరగొద్దన్నారు. వాస్తవానికి దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ ఎంటర్ కాకముందే కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. విదేశాల నుంచి వచ్చేవారికి పరీక్షలు నిర్వహించింది. కొందరు విదేశీయుల నిర్లక్ష్యం వలన దేశంలో ఒమిక్రాన్ వేగంగా విస్తరిస్తోంది. ప్రస్తుతం దేశంలో 400పైగా కేసులు నమోదయ్యాయి.
కేంద్రం ఇచ్చిన ఆదేశాలను కొన్నిరాష్ట్రాలు సీరియస్‌గా తీసుకోవడం లేదు. ఈ క్రమంలోనే మోడీ మరోసారి లాక్‌డౌన్ విధిస్తారేమో అని అంతా కంగారు పడ్డారు. కానీ పిల్లలకు వ్యాక్సినేషన్ గురించి శుభవార్త అందించారు. అయితే, ఈ విషయం చెప్పేందుకు మోడీ ఇంత అర్జెంట్‌గా ఎందుకు మాట్లాడారు. నెమ్మదిగా మరుసటి రోజు ఉదయాన్నే ప్రసంగం చేయొచ్చు కదా అని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: జేపీ వర్సెస్ జేడీ.. ఇలా అయిపోయారెంటీ?