https://oktelugu.com/

రోడ్డు ప్రమాదంలో యువ దర్శకుడు మృతి..

2020లో సంవత్సరం సినీ పరిశ్రమకు తీవ్ర విషాదాన్ని నింపుతోంది. ఇప్పటికే చిత్రసీమకు చెందిన పలువురు ప్రముఖులు ఈ సంవత్సరంలో మృతిచెందారు. ఇటీవల బాలీవుడ్ నటులు ఇర్ఫాన్ ఖాన్, రిషీ కపూర్ లు ఆకస్మికంగా మృతిచెందారు. తాజాగా తమిళ యువ దర్శకుడు ఏవీ అరుణ్ ప్రసాద్ రోడ్డు ప్రమాద దుర్ఘటనలో మృతిచెందడం సినీ పరిశ్రమలో విషాదాన్ని నింపింది. అరుణ్ ప్రముఖ దర్శకుడు శంకర్ వద్ద పలు సినిమాలకు అసిస్టెంట్ గా పనిచేశాడు. అరుణ్ మృతివార్త తెలుసుకున్న శంకర్ దిగ్భ్రాంతి […]

Written By:
  • Neelambaram
  • , Updated On : May 15, 2020 7:05 pm
    Follow us on

    2020లో సంవత్సరం సినీ పరిశ్రమకు తీవ్ర విషాదాన్ని నింపుతోంది. ఇప్పటికే చిత్రసీమకు చెందిన పలువురు ప్రముఖులు ఈ సంవత్సరంలో మృతిచెందారు. ఇటీవల బాలీవుడ్ నటులు ఇర్ఫాన్ ఖాన్, రిషీ కపూర్ లు ఆకస్మికంగా మృతిచెందారు. తాజాగా తమిళ యువ దర్శకుడు ఏవీ అరుణ్ ప్రసాద్ రోడ్డు ప్రమాద దుర్ఘటనలో మృతిచెందడం సినీ పరిశ్రమలో విషాదాన్ని నింపింది. అరుణ్ ప్రముఖ దర్శకుడు శంకర్ వద్ద పలు సినిమాలకు అసిస్టెంట్ గా పనిచేశాడు. అరుణ్ మృతివార్త తెలుసుకున్న శంకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు.

    శుక్రవారం ఉదయం తన సొంతూరు అన్నూర్ నుంచి ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. కొయాంబత్తూరు జిల్లాలోని మెట్టుపాల్యం వద్ద లారీని క్రాస్ చేస్తుండగా ప్రమాదానికి గురయ్యాడు. ఈ సంఘటనలో అరుణ్ మృతిచెందాడం తమిళ చిత్రసీమలో విషాదాన్ని నింపింది. అరుణ్ మృతిపై దర్శకుడు శంకర్ ట్వీటర్లో స్పందించారు. ‘యువ దర్శకుడు, నా మాజీ అసిస్టెంట్ అరుణ్ ఆకస్మిక మృతి నా గుండెను కలిచివేస్తోంది.. నీ మంచితనం.. సానుకూలత, కష్టపడే తత్వం నాకేంతో ఇష్టం.. నీకోసం ఈ దేవుడిని ప్రార్థిస్తూనే ఉంటాను.. నీ కుటుంబం, స్నేహితులను నా ప్రగాఢ సానుభూతి’ అని పేర్కొన్నారు.

    అరుణ్ దర్శకుడిగా ‘4జీ’ అనే మూవీని తెరకెక్కించాడు. కొన్ని అనివార్య కారణాలతో ఈ మూవీ రిలీజ్ కాలేదు. ఈ మూవీని రిలీజ్ చేసేందుకు నిర్మాత సీవీ కుమార్ ప్రయత్నిస్తుండగానే అరుణ్ మృతిచెందాడం శోచనీయంగా మారింది. ఆయన మృతిపట్ల ‘4జీ’ చిత్రబృందం సంతాపం వ్యక్తం చేసింది. అలాగే చిత్రసీమకు చెందిన పలువురు ప్రముఖులు ఆయన కుటుంబానికి సోషల్ మీడియాలో ప్రగాఢ సానుభూతిని తెలిపారు.