Tamil heroes box office strategy: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరు భారీ విజయాలను సాధిస్తున్నప్పటికి వెయ్యి కోట్లు కలెక్ట్ చేసే సినిమా ఒకటి కూడా చేయడం లేదు. కారణం ఏంటి అంటే వాళ్ల నుంచి వచ్చే సినిమాలు ప్రేక్షకులను అఎంటర్ టైన్ చేసినప్పటికి సూపర్ సక్సెస్ లుగా నిలవడం లేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీ తో ఒకప్పుడు పోటీ పడుతూ మేమే టాప్ పొజిషన్లో ఉన్నామని చెప్పుకున్న తమిళ్ సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు పాతాళానికి పడిపోయిందనే చెప్పాలి.
తెలుగు సినిమా ఇండస్ట్రీ తో పోటీ పడే స్థాయిలో కూడా తమిళ్ ఇండస్ట్రీ లేదు ఎందుకంటే ఇప్పుడు మన ఇండస్ట్రీ నెంబర్ వన్ పొజిషన్లో కొనసాగుతుంది. ఇక ఇప్పుడు తమిళ్ హీరోలు ఏం ఆలోచిస్తున్నారు. ఎందుకని ఒక్కటి కూడా 1000 కోట్లు కలెక్ట్ చేసే ఒక సినిమాను చేయలేకపోతున్నాడు అంటూ అక్కడి ప్రేక్షకులు సైతం ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.
నిజానికి వాళ్ళ నుంచి వచ్చే సినిమాలు ప్రేక్షకులను మెప్పించినప్పటికి వాటిలో ఏదో ఒక మైనస్ అయితే ఉంటుంది. దానివల్ల ఆ సినిమాలను ప్రేక్షకులు రిపీటెడ్ గా చూడడానికి ఇష్టపడడం లేదు. పాన్ ఇండియాలో సైతం వాళ్ళ సినిమాలకు పెద్దగా ఆదరణ దక్కడం లేదు… ఇప్పటివరకు ఎవరు ఇలాంటి సక్సెస్ లను సాధించిన కూడా తమిళ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలకు వచ్చే సక్సెస్ లు చాలా తక్కువనే చెప్పాలి.
ఒకప్పుడు బెస్ట్ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ ఫుల్ సినిమాలను చేసిన వాళ్లు ఇప్పుడు ఇలా డీలా పడిపోవడం వెనక చాలామంది చాలా రకాల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా కూడా తమిళ్ సినిమా ఇండస్ట్రీ మరోసారి పుంజుకోవాల్సిన అవసరమైతే ఉంది. లేకపోతే మాత్రం మలయాళం, కన్నడ ఇండస్ట్రీ కంటే కూడా వాళ్ళు వెనుకబడిపోయే పరిస్థితి ఏర్పడవచ్చు…ప్రస్తుతం తమిళ్ సినిమా ఇండస్ట్రీ డేంజర్ జోన్ లో ఉందనే చెప్పాలి…ఇప్పటికైనా వాళ్ళు తేరుకొని మంచి సినిమాలు చేయాల్సిన అవసరమైతే ఉంది…