Homeఎంటర్టైన్మెంట్Anchor Sravanti pink saree photos: హీరోయిన్స్ ని మించిన అందం.. యాంకర్ స్రవంతి లేటెస్ట్...

Anchor Sravanti pink saree photos: హీరోయిన్స్ ని మించిన అందం.. యాంకర్ స్రవంతి లేటెస్ట్ ఫోటోలు చూస్తే మెంటలెక్కిపోతారు..

Anchor Sravanti pink saree photos: ఒకప్పటి లాగా కాకుండా, ఈమధ్య కాలంలో మన బుల్లితెర మేకర్స్ ఎక్కువగా తెలుగు వాళ్ళకే అవకాశాలు ఇస్తున్నారు. సీరియల్స్ లో తెలుగు వాళ్ళు లీడ్ రోల్స్ లో కనిపించడం చాలా అరుదు కానీ , ఎంటర్టైన్మెంట్ షోస్ లో మాత్రం ఇప్పుడు పూర్తిగా తెలుగు వాళ్ళ హవా నే నడుస్తోంది. ఒకప్పుడు బుల్లితెర పై సుమ తిరుగులేని యాంకర్ గా కొనసాగింది. ఇప్పుడు మెల్లగా ఆమె స్థానాన్ని శ్రీముఖి ఆక్రమించేసుకుంది. […]

Anchor Sravanti pink saree photos: ఒకప్పటి లాగా కాకుండా, ఈమధ్య కాలంలో మన బుల్లితెర మేకర్స్ ఎక్కువగా తెలుగు వాళ్ళకే అవకాశాలు ఇస్తున్నారు. సీరియల్స్ లో తెలుగు వాళ్ళు లీడ్ రోల్స్ లో కనిపించడం చాలా అరుదు కానీ , ఎంటర్టైన్మెంట్ షోస్ లో మాత్రం ఇప్పుడు పూర్తిగా తెలుగు వాళ్ళ హవా నే నడుస్తోంది. ఒకప్పుడు బుల్లితెర పై సుమ తిరుగులేని యాంకర్ గా కొనసాగింది. ఇప్పుడు మెల్లగా ఆమె స్థానాన్ని శ్రీముఖి ఆక్రమించేసుకుంది. ఇప్పుడు ఎక్కడ చూసిన ఆమెనే కనిపిస్తోంది. కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో మాత్రం ఇప్పటికీ సుమ హవానే కొనసాగుతోంది. ఆమె తర్వాత మరో తెలుగు యాంకర్ స్రవంతి ఎక్కువగా ఈమధ్య కాలం లో ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో కనిపించడం మనమంతా చూస్తూనే ఉన్నాం. శివాజీ హీరోయిన్స్ ధరించే దుస్తులపై చేసిన కామెంట్స్ ఎంతటి సెన్సేషన్ అయ్యిందో అందరికీ తెలిసిందే.

ఆరోజు ఈవెంట్ కి స్రవంతి చక్కని చీర కట్టుకొని వచ్చింది. ఆమెని పొగుడుతూ , హీరోయిన్స్ అందరూ కూడా ఇలాంటి దుస్తులు ధరిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు కదా అంటూ కామెంట్స్ చేశాడు . ఆయన వ్యాఖ్యలు ఆరోజు ఎంత వైరల్ అయ్యాయో , స్రవంతి కూడా అదే రేంజ్ లో వైరల్ అయ్యింది. అంతే కాదు , సోషల్ మీడియా లో అత్యంత యాక్టీవ్ గా ఉండే సెలబ్రిటీలలో ఒకరి స్రవంతి. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను , వీడియోలను అప్లోడ్ చేస్తూ కుర్రాళ్ళ మతి పోయేలా చేస్తూ ఉంటుంది ఈ హాట్ బ్యూటీ. రీసెంట్ గానే ఈమె పింక్ సారీ లో కొన్ని ఫోటోలు దిగి వాటిని ఇన్ స్టాగ్రామ్ లో అప్లోడ్ చేయగా అవి సోషల్ మీడియా లో సెన్సేషనల్ అయ్యింది. ఈ ఫోటోలకు దాదాపుగా 25 వేలకు పైగా లైక్స్ రావడం విశేషం.

ఈ ఫోటోల క్రింద సినీ సెలబ్రిటీలు కూడా ‘ఎంత అందంగా ఉన్నావో , సో క్యూట్’ అంటూ కామెంట్స్ చేయడం గమనార్హం. ఇలాంటి ఫోటోలను ఆమె నిత్యం అప్లోడ్ చేస్తూనే ఉంటుంది. అందుకే ఇన్ స్టాగ్రామ్ లో ఆమెకు 7 లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఇకపోతే ప్రస్తుతానికి స్రవంతి చేతిలో ఎంటర్టైన్మెంట్ గేమ్ షోస్ ఏమి లేవు. కొద్దినెలల క్రితమే సుడిగాలి సుధీర్ హోస్ట్ గా వ్యవహరించిన ‘ది ఫ్యామిలీ స్టార్స్’ అనే ప్రోగ్రాం కి ‘కో హోస్ట్’ గా వ్యవహరించింది. ఈ షో ఇప్పుడు ముగిసిపోయింది. టీవీ లో షోస్ లేకపోయినా వరుసగా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ చేస్తూ ఫుల్ బిజీ గానే గడుపుతోంది స్రవంతి. బిగ్ బాస్ తెలుగు ఓటీటీ సీజన్ లో ఒక కంటెస్టెంట్ గా పాల్గొన్న స్రవంతి , ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 10 లో ఒక కంటెస్టెంట్ గా పాల్గొంటుందో లేదో చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper