NTR Star Directors: సినిమా ఇండస్ట్రీ అనగానే గుర్తుకొచ్చే పేరు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు…ఆయన తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందించాడు. ఆయన తర్వాత ఆ ఫ్యామిలీ నుంచి బాలయ్య బాబు వచ్చి యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక గొప్ప ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్నాడు. ఇక ఈయన చేసిన సినిమాల ద్వారా ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణను సంపాదించుకున్నాడు. ఇక ఇప్పటివరకు ఎన్టీఆర్ పాన్ ఇండియాలో గొప్ప గుర్తింపు కూడా సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక రీసెంట్ గా ‘వార్ 2’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బొక్క బోర్లా పడ్డాడు…
ఆయన తోటి హీరోలందరు పాన్ ఇండియాలో కలెక్షన్స్ ను కొల్లకొడుతుంటే ఆయన మాత్రం ఇంకా 500 కోట్ల దగ్గరే ఆగిపోయాడు. ఇక ఇప్పుడు రాబోతున్న సినిమాలతో సూపర్ సక్సెస్ ను సాధించాల్సిన అవసరమైతే ఉంది…ఇక ఎన్టీఆర్ ఎంటైర్ కెరియర్ లో ఒక ఇద్దరు దర్శకులు అతన్ని నమ్మించి రెండుసార్లు మోసం చేశారనే విషయం మనలో చాలామందికి తెలియదు.
ఇక కొన్ని సినిమాలు సూపర్ సక్సెస్ లను సాధిస్తాయని చెప్పి అతని చేత కొన్ని క్యారెక్టర్లను చేయించారు అందులో మొదటిగా బి.గోపాల్ పేరు చెప్పుకోవాలి. ఎందుకంటే అప్పటిదాకా సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, ఇంద్ర లాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ లను తీసిన బి గోపాల్ ఎన్టీఆర్ కి రెండు వరుస డిజాస్టర్లను కట్టబెట్టాడు. అందులో ఒకటి అల్లరి రాముడు అయితే మరొకటి నరసింహుడు కావడం విశేషం…
ఇక ఈ రెండు సినిమాలు భారీ ప్లాపులను మూట గట్టుకున్నాయి. ఇక బి గోపాల్ తర్వాత ఎన్టీఆర్ ని భారీగా దెబ్బతీసిన దర్శకుడు ఎవరు అంటే మెహర్ రమేష్…ఆయన చేసిన కంత్రి,శక్తి రెండు సినిమాలు కూడా డిజాస్టర్లయ్యాయి. వీటివల్ల ఎన్టీఆర్ కి ఎలాంటి క్రేజ్ రాకపోగా, తన మార్కెట్ ను సైతం కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది… అందుకే ఎన్టీఆర్ ఇప్పుడు ఒక సినిమా చేయడానికి చాలా రకాలుగా ఆలోచిస్తున్నాడు…