https://oktelugu.com/

Tamil Hero Vijay: రాజకీయాల్లోకి తమిళ హీరో విజయ్ ఎంట్రీ..త్వరలోనే పాదయాత్ర ప్రారంభం!

ఇక ఈ సినిమా విడుదల అయ్యే లోపు ఆయన తమిళనాడు రాష్ట్రం మొత్తం పాదయాత్ర చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నాడు.రీసెంట్ గానే అభిమానులతో సమావేశాన్ని ఏర్పాటు చేసిన విజయ్ , రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత ఇక సినిమాల్లో నటించబోనని చెప్పాడట. లియో తర్వాత ఆయన వెంకట్ ప్రభుతో ఒక సినిమా చెయ్యబోతున్నాడు. ఇదే ఆయన చివరి చిత్రం గా నిలవబోతుందట. ఈ సినిమా తర్వాత తన జీవితాన్ని రాజకీయాలకే అంకితం చేయబోతున్నట్టు సమాచారం.

Written By:
  • Vicky
  • , Updated On : July 12, 2023 / 04:02 PM IST

    Tamil Hero Vijay

    Follow us on

    Tamil Hero Vijay: సినీ రంగానికి చెందిన వాళ్ళు రాజకీయాల్లోకి రావడం అనేది కొత్తేమి కాదు. పెద్ద ఎన్టీఆర్ నుండి పవన్ కళ్యాణ్ వరకు అందరూ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన వారే. అయితే ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రమే కెరీర్ పీక్ స్టేజిలో ఉన్నప్పుడు అడుగుపెట్టాడు. ఆయన లాగ ఇలా డేరింగ్ అండ్ డ్యాషింగ్ నిర్ణయం ఎవ్వరూ తీసుకోలేరు అని అందరూ అనుకున్నారు.

    అయితే తమిళ నాడు లో ప్రస్తుతం సూపర్ స్టార్ రజినీకాంత్ ని మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ తో చేసే ప్రతీ సినిమాని బ్లాక్ బస్టర్ హిట్ చేస్తూ ముందుకు దూసుకుపోతున్న హీరో తలపతి విజయ్ కూడా అతి త్వరలోనే సినిమాలకు పూర్తి స్థాయిలో గుడ్ బై చెప్పి ఒక రాజకీయ పార్టీ ని స్థాపించబోతున్నాడని తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన ‘విక్రమ్’ చిత్ర దర్శకుడు లోకేష్ కనకరాజ్ తో ‘లియో’అనే చిత్రం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో తనకి సంబంధించిన షూటింగ్ ని రీసెంట్ గానే పూర్తి చేసాడు.

    ఇక ఈ సినిమా విడుదల అయ్యే లోపు ఆయన తమిళనాడు రాష్ట్రం మొత్తం పాదయాత్ర చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నాడు.రీసెంట్ గానే అభిమానులతో సమావేశాన్ని ఏర్పాటు చేసిన విజయ్ , రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత ఇక సినిమాల్లో నటించబోనని చెప్పాడట. లియో తర్వాత ఆయన వెంకట్ ప్రభుతో ఒక సినిమా చెయ్యబోతున్నాడు. ఇదే ఆయన చివరి చిత్రం గా నిలవబోతుందట. ఈ సినిమా తర్వాత తన జీవితాన్ని రాజకీయాలకే అంకితం చేయబోతున్నట్టు సమాచారం.

    త్వరలోనే ఒక భారీ బహిరంగ సభని ఏర్పాటు చేసి రాజకీయ పార్టీ ని ప్రకటించబోతున్నాడట. ప్రస్తుతం తమిళ నాడు లో అధికార పార్టీ కి సరైన విపక్షం లేదు. పొలిటికల్ స్పేస్ కావాల్సినంత ఉంది కాబట్టి ఆ స్పేస్ ని ఉపయోగించుకోవాలని చూస్తున్నాడు విజయ్. సరైన పద్దతి లో వెళ్తే ఆయన ముఖ్య మంత్రి అయ్యే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. చూడాలిమరి సక్సెస్ అవుతాడో లేదో అనేది.