Vijay: ఈమధ్య కాలం లో తమిళ హీరో విజయ్ చుట్టూ వివాదాలు తిరుగుతున్నాయో, లేకపోతే వివాదాల చుట్టూ విజయ్ తిరుగుతున్నాడో అసలు అర్థం కావడం లేదు. TVK పార్టీ ని స్థాపించి రాజకీయాల్లోకి అడుగుపెట్టినప్పటి నుండి విజయ్ చుట్టూ వివాదాలు అలుముకున్నాయి. నిన్న మొన్నటి వరకు ఆయన హీరో గా నటించిన చివరి చిత్రం ‘జన నాయగన్ ‘ విడుదల పట్ల కాంట్రవర్సీ నడిచింది. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా చెప్పలేని పరిస్థితి. ఇప్పుడు ఆయన సతీమణి సంగీత విడాకులు కోరుతూ చంగలపట్టు ఫ్యామిలీ కోర్టు లో పిటీషన్ వేయడం ఇప్పుడు తమిళనాడు లో సంచలనంగా మారింది. ఎక్కడ చూసినా దీని గురించే చర్చ. ఈ పిటీషన్ లో విజయ్ భార్య సంగీత చేసిన రెండు ప్రధాన ఆరోపణలు ఇప్పుడు సంచలనంగా మారాయి. అందులో మొదటి ఆరోపణ విజయ్ ఒక స్టార్ హీరోయిన్ తో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అని.
Also Read: ‘స్పిరిట్’ నుండి వివేక్ ఒబెరాయ్ ఫస్ట్ లుక్ వచ్చేసింది..ఇదేమి మాస్ బాబోయ్!
ఆ హీరోయిన్ మరెవరో కాదు, త్రిష కృష్ణన్. చాలా కాలం నుండి విజయ్ ఈమెతో డేటింగ్ చేస్తున్నాడు అంటూ సోషల్ మీడియా లో వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఏకంగా విజయ్ భార్య ఈ కారణంగా విడాకులు ఇవ్వడం గమనార్హం . అంటే ఇన్ని రోజులు సోషల్ మీడియా లో జరిగిన ప్రచారం అబద్దం కాదు , నిజమే అన్నమాట. ఇది కాసేపు పక్కన పెడితే విజయ్ కి చాలా కాలం నుండి మతి స్థిమితం సరిగా లేదంటూ ఆమె పిటీషన్ లో పేర్కొనడం ఇప్పుడు సంచలనం గా మారింది. విజయ్ కి మతి స్థిమితం సరిగా లేకపోతే ఒక రాజకీయ పార్టీ ని ఎలా స్థాపిస్తాడు, అన్ని సినిమాల్లో ఎలా నటిస్తాడు, ఇది కేవలం ఆరోపణ లాగా మాత్రమే ఉంది కానీ, ఎలాంటి అర్థం లేదని అభిమానులు అంటున్నారు.
మరో రెండు నెలల్లో తమిళనాడు ప్రాంతం లో ఎన్నికలు జరుగుతున్నాయి. సరిగ్గా ఈ సమయం లోనే విజయ్ భార్య ఇలా బయటకు వచ్చి విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కడం వెనుక కచ్చితంగా రాజకీయ దురుద్దేశం ఉందని, డంక్ పార్టీ విజయ్ సతీమణి ని తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకునుందని, ఇది చాలా అన్యాయం అంటూ సోషల్ మీడియా లో విజయ్ ఫ్యాన్స్ అంటున్నారు. ఇది ఎంత వరకు నిజమో తెలియదు కానీ, ఇన్ని రోజులు సైలెంట్ గా ఉంటూ, ఇప్పుడు అకస్మాత్తుగా ఇలా విడాకులు వైపుకు అడుగులు వేయడం చూస్తుంటే , విజయ్ ఫ్యాన్స్ చెప్పిన దాంట్లో కూడా నిజముంది కదా అని అంటున్నారు విశ్లేషకులు . ఎదో ఒకరోజు సంగీత DMK పార్టీ లో చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఏమి జరగబోతుంది అనేది.