https://oktelugu.com/

Vijay: దర్శకుడిగా మారిన తమిళ హీరో విజయ్ కొడుకు.. తొలి సినిమాలో హీరో ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

దర్శకుడిగా ఇండస్ట్రీ లోకి అతి త్వరలోనే అడుగుపెట్టబోతున్నాడు. ఈ సినిమాని లైకా సంస్థ నిర్మించబోతున్నట్టు తెలుస్తుంది. ఇందులో ప్రముఖ యంగ్ హీరో సందీప్ కిషన్ హీరో గా నటించబోతున్నట్టు టాక్.

Written By:
  • Vicky
  • , Updated On : September 9, 2024 / 04:55 PM IST

    Vijay

    Follow us on

    Vijay: ఒక సూపర్ స్టార్ హీరో కొడుకు భవిష్యత్తులో తన తండ్రిలాగానే స్టార్ హీరోనే అవ్వాలని ఎక్కడైనా రూల్ ఉందా?, అభిమానులు మా అభిమాన హీరో వారసుడు హీరోగానే ఎంట్రీ ఇవ్వాలి అని కోరుకుంటారు, అందులో ఎలాంటి తప్పు లేదు. కానీ హీరో అవ్వాలా?, లేదా డైరెక్టర్ అవ్వాలా అనేది ఆ వారసుడి వ్యక్తిగత నిర్ణయం కదా, దానిని అభిమానులు కచ్చితంగా స్వాగతించాల్సిందే. ప్రస్తుతం తమిళ స్టార్ హీరో విజయ్ కొడుకు సంజయ్ అదే చేస్తున్నాడు. త్వరలోనే హీరో విజయ్ సినిమాలను పూర్తిగా పక్కన పెట్టి రాజకీయాల్లో బిజీ కాబోతున్నాడు, ఇక ఆయన కొడుకు సంజయ్ విజయ్ ని రీ ప్లేస్ చేస్తాడని, వెండితెర మీద విజయ్ ని సంజయ్ లో చూసుకోవచ్చని అభిమానులు అనుకున్నారు. కానీ సంజయ్ కి నటన మీద పెద్దగా ఆసక్తి లేదు, కానీ దర్శకత్వం మీద మాత్రం అమితాసక్తి ఉంది.

    అందుకే ఆయన దర్శకుడిగా ఇండస్ట్రీ లోకి అతి త్వరలోనే అడుగుపెట్టబోతున్నాడు. ఈ సినిమాని లైకా సంస్థ నిర్మించబోతున్నట్టు తెలుస్తుంది. ఇందులో ప్రముఖ యంగ్ హీరో సందీప్ కిషన్ హీరో గా నటించబోతున్నట్టు టాక్. సందీప్ కిషన్ ఇది వరకే తమిళ ఆడియన్స్ కి బాగా సుపరిచితం అయ్యాడు. లోకేష్ కనకరాజ్ మొదటి చిత్రం ‘నగరం’ లో హీరో సందీప్ కిషన్. ఈ సినిమా తమిళంలో పెద్ద హిట్ అయ్యింది, ఆ తర్వాత కొన్నాళ్ళకు ఆయన ధనుష్ ‘కెప్టెన్ మిల్లర్’ సినిమా ద్వారా ఆయన తమిళ ఆడియన్స్ కి మరోసారి పరిచయం అయ్యాడు. రీసెంట్ గా ధనుష్ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహించిన ‘రాయన్’ చిత్రంలో కూడా సందీప్ కిషన్ కి మంచి పాత్ర దొరికింది. అలా కోలీవుడ్ ఆడియన్స్ కి బాగా సుపరిచితమైన సందీప్ కిషన్ తో సినిమా తీస్తే అటు తమిళంలోనూ, ఇటు తెలుగులోనూ బాగా వర్కౌట్ అవుతుందని, తాను రాసుకున్న కథకు సందీప్ మాత్రమే న్యాయం చేయగలదని సంజయ్ బలంగా నమ్ముతున్నాడట. ఈ ప్రాజెక్ట్ గురించి అతి త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. అయితే సంజయ్ ఇలా దర్శకుడిగా మాత్రమే స్థిరపడిపోతాడా?, లేదా భవిష్యత్తులో అయినా ఆయన హీరో గా మారుతాడా అనేది తెలియాల్సి ఉంది. హీరో గా కూడా కొనసాగితే అభిమానుల ఆనందానికి హద్దులే ఉండవు. కానీ సంజయ్ కి ఫిలిం మేకింగ్ మీద ప్రత్యేకమైన ఆసక్తి ఉంది.

    పలు కోర్సులు కూడా పూర్తి చేసి వచ్చాడట. అందుకే తన దృష్టిని ప్రస్తుతానికి దర్శకత్వం మీదనే ఉంచాడు. ఇదంతా పక్కన పెడితే విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’ చిత్రం మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ విజయ్ కి ఉన్న క్రేజ్ కారణంగా ఈ సినిమాకి తమిళనాడు మరియు ఓవర్సీస్ ప్రాంతాలలో కళ్ళు చెదిరే ఓపెనింగ్స్ వచ్చాయి. కేవలం నాలుగు రోజుల్లోనే ఈ చిత్రానికి 270 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయని అంటున్నారు. భవిష్యత్తులో ఎంత వసూళ్లను రాబడుతుందో చూడాలి.