Thalapathy Vijay divorce: తమిళ హీరో విజయ్(Thalapathy Vijay) సతీమణి సంగీత నిన్న తమిళనాడు లోని , చెంగలపట్టు ఫ్యామిలీ కోర్టు లో తనకు విజయ్ నుండి విడాకులు కావాలంటూ పిటీషన్ వేయడం సంచలనం గా మారింది. చాలా కాలం నుండి విజయ్ తన భార్య సంగీత తో దూరంగా ఉంటున్నాడని , ప్రముఖ స్టార్ హీరోయిన్ త్రిష తో ఆయన ప్రేమాయణం నడుపుతున్నాడని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నట్టు ఎన్నో వార్తలు వచ్చాయి. ఇవన్నీ కేవలం ఫ్యాన్ వార్స్ కోసం ఇతర హీరోల అభిమానులు పుట్టించే రూమర్స్ మాత్రమేనని, ఇందులో ఎలాంటి నిజం లేదని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు స్వయంగా ఆయన సతీమణి విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కడంతో అంతా ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. అభిమానులు కూడా తమ అభిమాన హీరో ని వెనకేసుకొని రాలేని పరిస్థితి. అయితే అసలు త్రిష తో విజయ్ రిలేషన్ షిప్ పెట్టుకోవడానికి కారణం ఒక డైరెక్టర్ అని అంటున్నారు విశ్లేషకులు.
ఆ డైరెక్టర్ మరెవరో కాదు , విజయ్ తో మాస్టర్, లియో వంటి చిత్రాలను తెరకెక్కించిన లోకేష్ కనకరాజ్. లియో మూవీ షూటింగ్ అధికారికంగా 2021 వ సంవత్సరం లో మొదలైంది. ఈ సినిమాలో హీరోయిన్ గా ముందు నయనతార ని తీసుకుందామని అనుకున్నారు కానీ, చివరికి త్రిష ని ఫిక్స్ చేశారు. త్రిష తో అప్పటికే విజయ్ బోలెడన్ని సినిమాలు చేశాడు. వీళ్ళ జంట బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఎన్నో సెన్సేషనల్ సినిమాలు వీళ్ళ కాంబినేషన్ లో వచ్చాయి. ఎప్పటి నుండి మంచి రిలేషన్ ఉంది. కానీ ‘లియో ‘ సినిమా షూటింగ్ సమయం లో ఆ రిలేషన్ కాస్త ప్రేమగా మారిందని కోలీవుడ్ వర్గాల్లో జోరుగా సాగుతున్న చర్చ. అప్పటి నుండే విజయ్ తన భార్య కు దూరంగా ఉంటున్నాడని, త్రిష ని దగ్గరకు తీసుకున్నాడని టాక్.
Also Read: ‘విష్ణు విన్యాసం’ మొదటిరోజు వరల్డ్ వైడ్ వసూళ్లు..ఇంత గ్రాస్ అసలు ఊహించలేదు!
ఇందులో ఆధారాలు లేవు, కేవలం ఆరోపణలు మాత్రమే. అయితే స్వయంగా విజయ్ భార్య సంగీత తన పిటీషన్ లో ఒక ప్రముఖ హీరోయిన్ తో విజయ్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అంటూ కామెంట్ చేయడం తో ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది కేవలం ఆరోపణే అయితే విజయ్ లేదా, త్రిష నుండి కౌంటర్ అటాక్ వచ్చేది. కానీ అలాంటిదేమి జరగలేదు. దీంతో విజయ్ ఫ్యాన్స్ కూడా ఏమి చేయలేక సైలెంట్ అయిపోయారు. అంతే కాదు సంగీత విజయ్ పై చాలా దారుణమైన ఆరోపణలు ఇంకా చాలానే చేసింది. విజయ్ కి మతి స్థిమితం సరిగా లేదని , ఆయన తనని గృహ హింసకు గురి చేశాడని, ఇలా చాలా బలమైన ఆరోపణలు చేసింది. ఇదంతా నిజమైతే మాత్రమే విజయ్ కి పెద్ద శిక్ష నే పడుతుంది. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఏమి జరగబోతుంది అనేది