Hit 3 Netflix: ఈ వీకెండ్ ఓటీటీ ఆడియన్స్ కి పండగే అని చెప్పొచ్చు. మే నెలలో విడుదలైన సూపర్ హిట్ సినిమాలన్నీ ఒకేసారి నెట్ ఫ్లిక్స్(Netflix) లోకి వచ్చేసాయి. థియేటర్స్ లో ఒకే రోజు విడుదలైన నాని(Natural Star Nani) ‘హిట్ 3′(Hit : The Third Case), సూర్య(Suriya Siva kumar) ‘రెట్రో'(Retro Movie) చిత్రాలు విడుదలయ్యాయి. ఈ రెండు సినిమాల ఫలితాలేంటో మన అందరికీ తెలిసిందే. ‘హిట్ 3’ చిత్రం నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిస్తే సూర్య ‘రెట్రో’ చిత్రం ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. కానీ బాక్స్ ఆఫీస్ వద్ద ఈ రెండు సినిమాల కలెక్షన్స్ కి పెద్దగా తేడా ఉండదు. ఎందుకంటే సూర్య రేంజ్ కి వంద కోట్ల గ్రాస్ అనేది డిజాస్టర్ తో సమానం. అదే విధంగా నాని కి వంద కోట్ల గ్రాస్ అనేది సూపర్ హిట్ తో సమానం. అయితే రెట్రో చిత్రానికి కచ్చితంగా ఓటీటీ లో మంచి రెస్పాన్స్ వస్తుందని అనుకున్నారు.
ఎందుకంటే ఆ చిత్రానికి దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్(Karthik Subbaraj). ఆయన సినిమాలకు ఓటీటీ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంటుంది. కాబట్టి రెస్పాన్స్ అదిరిపోతోంది అనుకున్నారు. అనుకున్నట్టుగానే రెస్పాన్స్ బాగానే వచ్చింది, కానీ ‘హిట్ 3’ కి మొదటి వారం లో వచ్చిన వ్యూస్ లో సగం కూడా రెట్రో కి రాలేదట. ‘హిట్ 3’ చిత్రానికి మొదటి వారంలో 43 లక్షల వ్యూస్ వస్తే, ‘రెట్రో’ చిత్రానికి 23 లక్షల వ్యూస్ వచ్చాయి. ‘హిట్ 3’ ఇండియా వైడ్ గా రెండవ స్థానం లో కొనసాగుతుంటే, ‘రెట్రో’ చిత్రం మూడవ స్థానం లో కొనసాగుతుంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ‘హిట్ 3’ కి మొదటి వారం లో వచ్చినంత వ్యూస్, మన టాలీవుడ్ లో చాలా మంది స్టార్ హీరోలకు కూడా రాలేదట. దీనిని బట్టి నాని బ్రాండ్ ఫ్యామిలీ ఆడియన్స్ లో ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.
‘హిట్ 3’ కేవలం ‘రెట్రో’ ని మాత్రమే కాదు , బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ లేటెస్ట్ చిత్రం ‘సికిందర్’ ని కూడా డామినేట్ చేసింది. సికిందర్ చిత్రానికి మొదటి వారం లో కేవలం మూడు మిలియన్ వ్యూస్ మాత్రమే వచ్చాయి. ఇక రీసెంట్ గానే హిందీ లో సూపర్ హిట్ గా నిల్చిన ‘జాట్’ చిత్రాన్ని కూడా నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేశారు. కనీసం ఈ సినిమా అయినా ‘హిట్ 3 ‘ డామినేట్ చేస్తుందా లేదా అనేది చూడాలి. ఆరంభం అదిరింది కానీ లాంగ్ రన్ లో ‘హిట్ 3 ‘ ఎంతమేరకు ఓటీటీ లో సక్సెస్ అవుతుంది అనేది చూడాలి. ఓటీటీ లో నాని సినిమాలకు ఈ రేంజ్ రెస్పాన్స్ రావడంతో ఆయన తదుపరి చిత్రం ‘ది ప్యారడైజ్’ ని 70 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసిందట.