Tamil Hero simbu: పవన్ కళ్యాణ్ హీరోయిన్ తో తమిళ హీరో శింబు పెళ్లి ఖరారు..ముహూర్తం ఎప్పుడంటే!

లేటెస్ట్ గా ఆయన ప్రముఖ యంగ్ హీరోయిన్ నిధి అగర్వాల్ తో చాలా కాలం నుండి ప్రేమాయణం నడుపుతూ డేటింగ్ చేస్తున్నాడని టాక్ వినిపిస్తుంది. వీళ్లిద్దరు కలిసి గతంలో 'ఈశ్వరన్' అనే చిత్రంలో చేసారు. ఆ సమయం లో వీళ్లిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం, ప్రేమగా మారిందని, డేటింగ్ కూడా చేసుకుంటున్నారని కోలీవుడ్ లో విస్తృతంగా ప్రచారం అయ్యింది.

Written By: Vicky, Updated On : September 29, 2024 4:47 pm

 Tamil Hero simbu-Nidhi Agarwal

Follow us on

Tamil Hero simbu : కోలీవుడ్ లో యూత్ మాస్ ఆడియన్స్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న యువ హీరోలలో ఒకరు శింబు. బాలనటుడిగా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించిన ఈయన పెద్దయ్యాక హీరో గా మారి ఎన్నో సంచలన విజయాలను అందుకున్నాడు. ఈయన హీరో గా నటించిన ‘మన్మధ’, ‘వల్లభ’ వంటి తమిళ చిత్రాలు తెలుగు లో కూడా డబ్ అయ్యి సంచలన విజయాలుగా నమోదు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఈయన నటించిన సినిమాలో తెలుగులో డబ్ అయ్యినప్పటికీ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయాయి. కానీ శింబు అంటే ఇప్పటికీ మన తెలుగు ఆడియన్స్ మంచి అభిమానం ఉంది. సరైన కంటెంట్ సినిమాని తెలుగులోకి డబ్ చేస్తే కచ్చితంగా సూపర్ హిట్ ని చేస్తారు. శింబు మంచి నటుడు మాత్రమే కాదు, గొప్ప సింగర్ కూడా. తెలుగులో ఆయన ఇప్పటి వరకు ‘బాద్ షా’, ‘పోటుగాడు’ వంటి చిత్రాల్లో పాటలు పాడాడు. రీసెంట్ గా ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ‘ఓజీ’ చిత్రంలో కూడా ఒక అద్భుతమైన పాటను పాడాడు.

త్వరలోనే ఈ పాట విడుదల కాబోతుంది. ఇదంతా పక్కన పెడితే శింబు కి ప్రేమ వ్యవహారాలు కూడా చాలా ఎక్కువే. ప్రముఖ స్టార్ హీరోయిన్ నయనతార తో ఈయన చాలా కాలం వరకు ప్రేమాయణం నడిపాడు అనే విషయం మన అందరికీ తెలిసిందే. వీళ్ళ ప్రేమ పెళ్లి వరకు వెళ్తుంది అనుకునేలోపే కొన్ని అనుకోని కారణాల వల్ల బ్రేకప్ అయ్యింది. ఆ తర్వాత శింబు హన్సిక తో కూడా ప్రేమాయణం నడిపాడని టాక్ వినిపించింది. ఇప్పుడు లేటెస్ట్ గా ఆయన ప్రముఖ యంగ్ హీరోయిన్ నిధి అగర్వాల్ తో చాలా కాలం నుండి ప్రేమాయణం నడుపుతూ డేటింగ్ చేస్తున్నాడని టాక్ వినిపిస్తుంది. వీళ్లిద్దరు కలిసి గతంలో ‘ఈశ్వరన్’ అనే చిత్రంలో చేసారు. ఆ సమయం లో వీళ్లిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం, ప్రేమగా మారిందని, డేటింగ్ కూడా చేసుకుంటున్నారని కోలీవుడ్ లో విస్తృతంగా ప్రచారం అయ్యింది.

ఆ తర్వాత కొన్ని రోజులు ఈ రూమర్స్ కి బ్రేక్ పడింది, కానీ ఇప్పుడు మళ్ళీ వీళ్ళ ప్రేమ వ్యవహారం తెరమీదకు వచ్చింది. ఇరు కుటుంబాల మధ్య అంగీకారం తో పెళ్లి కూడా ఫిక్స్ చేసుకున్నట్టు, త్వరలోనే అట్టహాసంగా చెన్నైలో వీళ్లిద్దరి పెళ్లి జరగబోతున్నట్టు టాక్. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. నిధి అగర్వాల్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో కలిసి ‘హరి హర వీరమల్లు’ చిత్రంలో నటిస్తుంది. ఇక శింబు విషయానికి వస్తే ‘మానాడు’ చిత్రం తో భారీ కమర్షియల్ సూపర్ హిట్ ని అందుకొని సక్సెస్ ట్రాక్ లోకి వచ్చిన శింబు, ఆ తర్వాత వరుసగా రెండు సూపర్ హిట్స్ ని అందుకున్నాడు. ఇప్పుడు ఆయన డ్యూయల్ రోల్ లో ఒక సినిమా, అలాగే కమల్ హాసన్ తో కలిసి ‘ది తగ్ లైఫ్’ వంటి చిత్రాలు చేస్తున్నాడు.