https://oktelugu.com/

Nandamuri  BalaKrishna : నందమూరి వంశానికి అసలైన వారసుడు నా కొడుకు మాత్రమే..ఇక ఎవ్వరు లేరంటూ బాలయ్య సంచలన కామెంట్స్!

దమ్ము చిత్రం సమయంలో టీడీపీ కార్యకర్తలకు, నందమూరి అభిమానులకు ఆ సినిమా చూడొద్దు అంటూ బాలయ్య నుండి వ్యక్తిగత మెసేజిలు కూడా వెళ్లాయి. అలా అప్పటి నుండి ఇప్పటి వరకు వీళ్లిద్దరి మధ్య ఎదో కోల్డ్ వార్ నడుస్తూనే ఉంది.

Written By:
  • Vicky
  • , Updated On : September 29, 2024 / 05:01 PM IST

    Balakrishna comments

    Follow us on

    Nandamuri  BalaKrishna :  నందమూరి కుటుంబం లో చీలికలు ఏర్పడ్డాయని, బాలయ్య బాబు కి జూనియర్ ఎన్టీఆర్ కి మధ్య కోల్డ్ వార్ నడుస్తుందని, అనేక సందర్భాలలో బాలయ్య బాబు ఎన్టీఆర్ ని అవమానించాడని సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకునే మాటలు. ఎన్టీఆర్ ఇప్పటి వరకు బాలయ్య ని అవమానిస్తూ ఒక్క మాట కూడా మాట్లాడలేదు కానీ, బాలయ్య మాత్రం అనేక సందర్భాలలో సెటైర్లు విసిరిన సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా ‘నాన్నకు ప్రేమతో’ సినిమా షూటింగ్ సమయంలో ఆ గొడవ తారాస్థాయికి చేరిందని, అప్పట్లో ఎన్టీఆర్ అసహనం వ్యక్తం చేస్తూ ట్విట్టర్ లో ట్వీట్ కూడా వేసాడని, ఆ తర్వాత డిలీట్ చేసాడని అంటుంటారు. దమ్ము చిత్రం సమయంలో టీడీపీ కార్యకర్తలకు, నందమూరి అభిమానులకు ఆ సినిమా చూడొద్దు అంటూ బాలయ్య నుండి వ్యక్తిగత మెసేజిలు కూడా వెళ్లాయి. అలా అప్పటి నుండి ఇప్పటి వరకు వీళ్లిద్దరి మధ్య ఎదో కోల్డ్ వార్ నడుస్తూనే ఉంది.

    రీసెంట్ గా అబుదాబి లో ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం అకాడమీ (IIFA) అవార్డ్స్ ఫంక్షన్ జరిగింది. దేశంలోని సూపర్ స్టార్స్ అందరూ ఈ ఈవెంట్ లో పాల్గొని విజయవంతం చేసారు. మన టాలీవుడ్ నుండి నందమూరి బాలకృష్ణ తో పాటు చిరంజీవి, వెంకటేష్ వంటి వారు కూడా విచ్చేసారు. వీరి చేత ఈవెంట్ నిర్వాహకులు పలు అవార్డ్స్ ని ఇప్పించారు. చిరంజీవి కి IIFA లో ‘అవుట్ స్టాండింగ్ అఛీవ్మెంట్ ఇన్ ఇండియన్ సినిమా’ అవార్డు దక్కింది. ఇది ఇలా ఉండగా ఈ ఈవెంట్ కి వెళ్లేముందు ఒక యాంకర్ ప్రముఖ సెలబ్రిటీస్ అందరితో ఇంటర్వ్యూస్ చేసింది. బాలయ్య తో కూడా ఒక ర్యాపిడ్ ఫైర్ ఇంటర్వ్యూ చేసారు. ఈ ఇంటర్వ్యూ లో బాలయ్య ని యాంకర్ ఒక ప్రశ్న అడుగుతూ ‘ప్రస్తుతం తరం లో మీ కుటుంబం నుండి నందమూరి వారసుడు ఎవరని అనుకుంటున్నారు?’ అని అడగగా, దానికి బాలయ్య సమాధానం చెప్తూ ‘ఇంకెవ్వరు..నా కొడుకు మోక్షజ్ఞ మాత్రమే..ఇక ఎవరున్నారు’ అని అంటాడు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారడం తో ఎన్టీఆర్ అభిమానులు బాలయ్య పై ఫైర్ అయ్యాడు.

    బాలయ్య కి ఎన్టీఆర్ ఎదుగుదల అంటే అసూయ అని, నందమూరి ఖ్యాతిని గ్లోబల్ స్థాయిలో విస్తరింప చేసిన ఎన్టీఆర్ ని చూసి గర్వపడాల్సింది పోయి, అతన్ని అడుగడుగునా విమర్శించడం అన్యాయమని, ఎన్టీఆర్ లేకుంటే నందమూరి కుటుంబం ఈరోజు ఇండస్ట్రీ లో ఇలా ఉండేది కాదు అంటూ సోషల్ మీడియా లో ఎన్టీఆర్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా రీసెంట్ గానే ఎన్టీఆర్ మోక్షజ్ఞ కొడుకు పుట్టిన రోజు సందర్భంగా అతనికి శుభాకాంక్షలు తెలియచేస్తూ అతనికి మొదటి సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా అప్లోడ్ చేసిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ వైపు నుండి బాలయ్య కుటుంబానికి అపారమైన గౌరవం ఉంది కానీ, బాలయ్య కి మాత్రం అలాంటి గౌరవం లేదంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.