Vidamuyaechi Movie : మన టాలీవుడ్ ఇండస్ట్రీ మాదిరిగా తమిళ ఇండస్ట్రీ లో ఆరు మంది స్టార్ హీరోలుండరు. అక్కడ ఉండేది కేవలం ఇద్దరు స్టార్ హీరోలు మాత్రమే. వారిలో ఒకరు అజిత్ కాగా, మరొకరు విజయ్. రజినీకాంత్ కూడా వీళ్ళతో సరిసమానంగా ఓపెనింగ్స్, క్లోజింగ్ వసూళ్లను రాబడుతాడు కానీ, ఆయన వయస్సు 70 ఏళ్ళు దాటినందున ఈ ఇద్దరి హీరోల క్యాటగిరీలో వేయలేదు. ఈ ముగ్గురిలో విజయ్ కి నాన్ స్టాప్ గా సూపర్ హిట్స్ వస్తున్నాయి కానీ, అజిత్ మాత్రం తన రేంజ్ కి తగ్గ హిట్ ని అందుకొని దశాబ్దం దాటింది. కానీ ఆయనకీ ఉన్నటువంటి కల్ట్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ కారణంగా ముందు సినిమాల ప్రభావం, తదుపరి సినిమాల మీద పడడం లేదు. ఫలితంగా ఓపెనింగ్ వసూళ్లు కళ్ళు చెదిరే రేంజ్ లో ఓపెనింగ్ వసూళ్లు వస్తున్నాయి. అందుకు ఉదాహరణగా నిల్చింది ‘విడాముయార్చి’ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్.
తెలుగులో ఈ సినిమాని పట్టుదల అనే పేరుతో దబ్ చేసి విడుదల చేస్తున్నారు. కాసేపటి క్రితమే చెన్నై, బెంగళూరు, ఓవర్సీస్ వంటి ప్రాంతాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. ట్రేడ్ విశ్లేషకులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు కలిపి ఆరు కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయట. ఇది కేవలం నాలుగు గంటల్లోనే అవ్వడం మరో విశేషం. పెద్దగా అంచనాలు లేని ఈ సినిమాకి ఈ రేంజ్ సెన్సేషనల్ బుకింగ్స్ ట్రెండ్ ఉంటుందని అభిమానులు కూడా ఊహించలేదు. కర్ణాటక ప్రాంతం మొత్తం మీద 20 వేల టిక్కెట్లు ఈ తక్కువ సమయంలో అమ్ముడుపోయాయట. గ్రాస్ 60 లక్షల రూపాయలకు పైగానే ఉంటుందని అంచనా. అదే విధంగా ఓవర్సీస్ లోని నార్త్ అమెరికా లో కేవలం ప్రీమియర్ షోస్ నుండి ఈ చిత్రానికి 2 లక్షల డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయట.
ప్రీమియర్ షోస్ కి ఇంకా నాలుగు రోజుల సమయం ఉంది. ఈ నాలుగు రోజుల్లో ఆరు లక్షల డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది అజిత్ కెరీర్ లోనే ది బెస్ట్ ఓపెనింగ్ అని చెప్పొచ్చు. ఈ సినిమాకి ఉన్నటువంటి ఏకైక మైనస్ ఏమిటంటే , ఇది కేవలం తమిళ సినిమా మాత్రమే, పాన్ ఇండియా కాదు. కాబట్టి మొదటి రోజు వంద కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు రావడం కష్టమే అని అంటున్నారు. వంద కోట్లు కాకపోయినా ప్రాంతీయ బాషా చిత్రం కాబట్టి 80 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ ని రాబడితే సెన్సేషనల్ ఓపెనింగ్స్ వచ్చినట్టే అని అంటున్నారు ట్రేడ్ పండితులు. తెలుగు లో అజిత్ కి మంచి క్రేజ్ ఉంది. ఈ సినిమా మీద అంచనాలు పెద్దగా లేవు కాబట్టి, తెలుగు వెర్షన్ బుకింగ్స్ చాలా స్లో గా ఉన్నాయి. కానీ టాక్ వస్తే మాత్రం పుంజుకునే అవకాశాలు ఉన్నాయి.