Rajamouli: కోలీవుడ్ ప్రేక్షకులకు భాషాభిమానం, ప్రాంతాభిమానం ఎక్కువ. విషయం ఏదైనా మేమే గొప్పంటారు. ఇతర పరిశ్రమల ఆధిపత్యాన్ని అసలు ఒప్పుకోరు. ఒకప్పుడు బాలీవుడ్ తర్వాత పెద్ద పరిశ్రమ మాదే అని వారు గర్వపడేవారు. గత దశాబ్ద కాలంలో లెక్కలు మారిపోయాయి. బాలీవుడ్ ని కూడా తలదన్నేలా టాలీవుడ్ ఎదిగింది. దీనంతటికి రాజమౌళి కారణమయ్యాడు. బాహుబలి సిరీస్ తో ఆయన తెలుగు సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లారు. బాహుబలి 2 ఇండియన్ బాక్సాఫీస్ రికార్డ్స్ తిరగరాసింది. బాహుబలి స్ఫూర్తితో పాన్ ఇండియా కాన్సెప్ట్ సౌత్ లో ఊపందుకుంది.

కెజిఫ్, పుష్ప లాంటి భారీ పాన్ ఇండియా చిత్రాల రూపకల్పనకు బాహుబలి కారణమైంది. ఇక ఆర్ ఆర్ ఆర్ మూవీతో మరో ఇండియన్ బ్లాక్ బస్టర్ రాజమౌళి ఖాతాలో వేసుకున్నారు. కాగా బాహుబలి మించిన చిత్రం చేయాలని కోలివుడ్ ఎప్పటి నుండో ప్రయత్నం చేస్తుంది. బాహుబలి రికార్డ్స్ బద్దలు కొట్టి సౌత్ లో తమదే అతిపెద్ద ఇండస్ట్రీ అని గర్వంగా చాటాలని చూస్తున్నారు. దానికి పొన్నియిన్ సెల్వన్ సరైన చిత్రంగా తమిళ ప్రేక్షకులు భావించారు.

అలాగే తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీ పరువుగా ఆ చిత్రాన్ని ప్రచారం చేశారు. తీరా విడుదలయ్యాక పొన్నియిన్ సెల్వన్ నిరాశపరిచింది. ఊహించిన స్థాయిలో లేదని తెల్చేశారు. ఇది బాహుబలికి ఏమాత్రం పోటీ కాదని కొట్టిపారేస్తున్నారు. ఇది తమిళ ఆడియన్స్ లో మంట పుట్టిస్తుంది. దీంతో బాహుబలి చిత్రాల్లో లేని లోపాలు వెతుకుతూ ఆనందం పొందుతున్నారు. బాహుబలిలో కొన్ని సీన్స్ పొన్నియిన్ సెల్వన్ నుండి రాజమౌళి లేపేశాడు అంటున్నారు. ఇదే ప్రూఫ్ అంటూ వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. ఎప్పుడో వచ్చిన బాహుబలి చిత్రంలో సీన్స్ పొన్నియిన్ సెల్వన్ నుండి రాజమౌళి కాపీ చేయడం ఏమిటని మీకు సందేహం కలగవచ్చు.
పొన్నియిన్ సెల్వన్ కల్కి కృష్ణమూర్తి రాసిన నవల ఆధారంగా తెరకెక్కింది. అప్పట్లో ఆ నవల నుండి రాజమౌళి బాహుబలి సీన్స్ కాపీ చేశాడట. ఒక వేళ రాజమౌళి ఆ పని చేసినా దాన్ని స్ఫూర్తి పొందడం అంటారు కానీ కాపీ అని ఎలా చెప్తారు. ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు, పొన్నియిన్ సెల్వన్ చిత్రానికి మిక్స్ టాక్ రావడంతో తమిళ నెటిజెన్స్ రాజమౌళిని, బాహుబలి చిత్రాలను కించపరిచే, తక్కువ చేసే కార్యక్రమం స్టార్ట్ చేశారు. వీడియోలు పోస్ట్ చేస్తూ అర్థం లేని వాదనకు దిగుతున్నారు. బాహుబలి కంటే పొన్నియిన్ సెల్వన్ గొప్ప సినిమా అని చెబుతున్న తమిళ ఆడియన్స్ కి రికార్డ్స్ బుద్ధి చెప్పనున్నాయి. ఎందుకంటే బాహుబలి 2 వసూళ్ల దరిదాపుల్లోకి కూడా పొన్నియిన్ సెల్వన్ వెళ్ళలేదు. ఇతర భాషల్లో ఆ సినిమా రాణించడం కష్టమే.
