https://oktelugu.com/

BigBoss: ప్రేమ పేరుతో మోసపోయిన ప్రముఖ బిగ్​బాస్​ నటి

BigBoss: ప్రేమ పేరుతో దగ్గరకు వచ్చి నటిస్తే నమ్మి మోసపోయే అమ్మాయిలను చాలా మందిని చూస్తుంటాం. ఇందుకు సెలబ్రిటీలూ అతీతం కాదు. తాజాగా, ప్రముఖ తమిళ్​ బిగ్​బాస్ నటి జూలీ అమింజికరై అలియాస్ మరియా జులియానాా ఓ అబ్బాయి చేతిలో మోసపోయి పోలీసులను ఆశ్రయించింది. నాగేళ్లు తనను ప్రేమించి.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. మాయమాటలు చెప్పి తన నగలు, నగదు తీసుకుని పరారైనట్లు ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అయ్యావు కాలనీతో ఉడే మనీశ్​ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 7, 2021 / 11:27 AM IST
    Follow us on

    BigBoss: ప్రేమ పేరుతో దగ్గరకు వచ్చి నటిస్తే నమ్మి మోసపోయే అమ్మాయిలను చాలా మందిని చూస్తుంటాం. ఇందుకు సెలబ్రిటీలూ అతీతం కాదు. తాజాగా, ప్రముఖ తమిళ్​ బిగ్​బాస్ నటి జూలీ అమింజికరై అలియాస్ మరియా జులియానాా ఓ అబ్బాయి చేతిలో మోసపోయి పోలీసులను ఆశ్రయించింది. నాగేళ్లు తనను ప్రేమించి.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. మాయమాటలు చెప్పి తన నగలు, నగదు తీసుకుని పరారైనట్లు ఫిర్యాదులో పేర్కొంది.

    పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అయ్యావు కాలనీతో ఉడే మనీశ్​ అనే యువకుడితో నాలుగేళ్ల పాటు ప్రేమలో పడింది జూలి. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. అయితే, మనీశ్​ ఆమెకు మాయమాటలు చెప్పి విలువైన బైక్​, రిఫ్రిజరేటర్​, నగలు, నగదు తీసుకుని పారిపోయాడు. విషయం తెలుసుకునే లోపే మోసపోయానని గుర్తించిన జూలి. మహిళా పోలీస్​ స్టేషన్​ను ఆశ్రయించింది. మనీశ్​పై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

    చెన్నైలో మెరీనా బీచ్​ వేదికగా జరిగిన జల్లికట్టు ఉద్యమంలో పాల్గొని.. అందరి దృష్టిని ఆకర్షించింది జులియానా. ఈ ఉద్యంలో ఆమె చేసిన నినాదాలకు సంబంధించిన వీడియోలు అప్పట్లో నెట్టిింట వైరల్​గా మారాయి. ఇదే క్రేజ్​తో కమల్​హాసన్ హోస్ట్​గా వ్యవహరిస్తున్న బిగ్​బాస్​లో ఛాన్స్ కొట్టేసింది. అప్పటి నుంచే తరచూ వివాదాల్లో హాట్​టాపిక్​గా మారింది.