BigBoss: ప్రేమ పేరుతో దగ్గరకు వచ్చి నటిస్తే నమ్మి మోసపోయే అమ్మాయిలను చాలా మందిని చూస్తుంటాం. ఇందుకు సెలబ్రిటీలూ అతీతం కాదు. తాజాగా, ప్రముఖ తమిళ్ బిగ్‌బాస్ నటి జూలీ అమింజికరై అలియాస్ మరియా జులియానాా ఓ అబ్బాయి చేతిలో మోసపోయి పోలీసులను ఆశ్రయించింది. నాగేళ్లు తనను ప్రేమించి.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. మాయమాటలు చెప్పి తన నగలు, నగదు తీసుకుని పరారైనట్లు ఫిర్యాదులో పేర్కొంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అయ్యావు కాలనీతో ఉడే మనీశ్ అనే యువకుడితో నాలుగేళ్ల పాటు ప్రేమలో పడింది జూలి. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. అయితే, మనీశ్ ఆమెకు మాయమాటలు చెప్పి విలువైన బైక్, రిఫ్రిజరేటర్, నగలు, నగదు తీసుకుని పారిపోయాడు. విషయం తెలుసుకునే లోపే మోసపోయానని గుర్తించిన జూలి. మహిళా పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించింది. మనీశ్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
చెన్నైలో మెరీనా బీచ్ వేదికగా జరిగిన జల్లికట్టు ఉద్యమంలో పాల్గొని.. అందరి దృష్టిని ఆకర్షించింది జులియానా. ఈ ఉద్యంలో ఆమె చేసిన నినాదాలకు సంబంధించిన వీడియోలు అప్పట్లో నెట్టిింట వైరల్‌గా మారాయి. ఇదే క్రేజ్‌తో కమల్‌హాసన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్‌లో ఛాన్స్ కొట్టేసింది. అప్పటి నుంచే తరచూ వివాదాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Tamil bigg boss actress julie files a case against boyfriend
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com