Bigg Boss 5 Telugu: ఒకే ఇంట్లో ఓ ఫ్యామిలీగా 20 మంది. కానీ ఒకరి గురించి ఒకరికి అసలు తెలేదు. అలా కొన్ని వారాల పాటు ఫోన్, టీవీ, ఇలా బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా చూపించే రియాలిటీ షో బిగ్‌బాస్. ఈ షోను ఎంత మంది హేట్ చేస్తారో.. అంతకు రెట్టింపు అభిమానులు కూడా ఉన్నారు.
Bigg Boss 5 Telugu
చుట్టూ పదుల సంఖ్యలో కెమెరాలు, 24 గంటలు కంటెస్టెంట్లను గమిస్తూంటాయి. వారు వారిలో ఉండటమే బిగ్‌బాస్‌లో అతిపెద్ద టాస్క్. అందులోంచి ఓ గంట పాటు ప్రేక్షకులకుచూపించి.. ఓట్ల ద్వారా తమకిష్టమైన వ్యక్తిని గెలిపించడమే అసలైన గేమ్. ఈ క్రమంలోనే ఫైనల్ విజేతెవరో తెలుస్తుంది. అయితే, తాజాగా బిగ్‌బాస్ సీజన్5లో కూడా ప్రేక్షకాదరణ పొందిన సన్నీ టైటిల్ విన్నర్‌గా నిలిచారు. ఇప్పుడు ఇదే చర్చనీయాంశమైంది. బిగ్‌బాస్ జరిగిన 5 సీజన్లలో ఆవేశపరులకే టైటిల్ ఇస్తున్నట్లు నెటింట్లో టాక్ వినిపిస్తోంది.
Also Read: బిగ్ బాస్ విన్నర్ సన్నీ ఎందుకు గెలిచారు? ఎలా గెలిచారు.? అసలు కారణాలేంటి?
తొలిసారి ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వచ్చిన బిగ్‌బాస్ సీజన్1లో శివబాలాజీ కూడా ఒక్కోసారి ఆవేశాన్ని హద్దులు మీరి ప్రవర్తించడం అందరికీ తెలిసిందే. ఒకానొక సమయంలో బిగ్‌బాస్‌నే తప్పుపట్టిన సందర్భాలు ఉన్నాయి. చివరకు అతనే టైటిల్ విన్నర్ కావడం విశేషం.
Bigg Boss 1 Title Winner Shiva Balaji and Host Jr NTR
ఆ తర్వా త నాని హోస్ట్‌గా వ్యవహరించిన సీజన్2లో కౌశల్ వ్యవహరించిన శైలి పెద్ద చర్చకే దారి తీసింది. అతని ఆవేశానికి ప్రేక్షకులు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలూ లేకపోలేదు. కానీ, ఆ ఆవేశమే పోను పోనూ అతన్ని ప్రేక్షకులను దగ్గరగా చేసింది. కౌశల్ ఆర్మీ అంటూ ఓ పెద్ద టీమ్‌నే క్రియేట్ చేసుకునేలా చేసింది. దీంతోనే కౌశల్ బిగ్‌బాస్ విజేతగా నిలిచారు.
Bigg Boss 2 Title Winner Kaushal, Host Nani and Guest Venkatesh
Also Read: ఆ నలుగురు బిగ్ బాస్ విన్నర్స్ ఏం సాధించారు?.. సన్నీ పరిస్థితి ఏమవుతుంది?
ఆ తర్వాత మూడో సిజన్ నుంచి కింగ్ నాగార్జున బిగ్‌బాస్‌లోకి అడుగుపెట్టారు. అప్పటి నుంచి తాజా సీజన్ వరకు ఆయనే వ్యాఖ్యతగా వ్యవహిస్తున్నారు. కాగా, మూడో సీజన్లో రాహుల్ సిప్లిగంజ్‌కి ఉన్న ఆవేశానికి హైస్‌లో ఎక్కవ రోజులు ఉండటం కూడా కష్టమని అందరూ భావించారు. కానీ, అతను కూడా విజేతగా నిలిచాడు. ఆ తర్వాత మిస్టర్ కూల్ అనిపించుకున్న అభిజిత్‌కు బిగ్‌బాస్ ట్రోఫీ దక్కింది ఇప్పుడు మరోసారి కోపిస్టిగా పేరు తెచ్చుకున్న సన్నికి బిగ్‌బాస్ టైటిల్ వరించింది.
Bigg Boss 3 Title Winner Rahul Sipliganj, Host Nagarjuna and Guest Chiranjeevi
Bigg Boss 4 Title Winner Abijeeth, Host Nagarjuna and Guest Chiranjeevi
దీన్ని బట్టి చూస్తుంటే.. హౌస్‌లో నిజాయితీ కంటే.. తమలోని ఎమోషన్స్‌ను కంట్రోల్ చేసుకుంటూ.. తమలో మార్పు తెచ్చుకునే వారినే ప్రజలు, బిగ్‌బాస్ గమనించి వారిని గెలిపిస్తున్నారన్నది అర్థమవుతోంది. ఇప్పటి వరకు గెలిచిన వారంతా కూడా తమలో ఆవేశాన్ని అనుచుకుని.. హౌస్‌లో అందరి మన్ననలను పొంది చివరకు ప్రేక్షకుల హృదయాలను కూడా గెలుచుకున్నారు.
Bigg Boss 5 Title Winner VJ Sunny, Host Nagarjuna
Also Read: షణ్ముఖ్ కి టైటిల్ దూరం అవ్వడానికి కారణం అదేనా…
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Every time this type of people get bigg boss title
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com