https://oktelugu.com/

Daku Maharaj : ‘నాకు తండ్రి లేడు..ఆయన స్థానం లో మా బాలయ్య ఉన్నాడు’ అంటూ ‘డాకు మహారాజ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో తమన్ వ్యాఖ్యలు!

సీనియర్ హీరోస్ లో ప్రస్తుతం బాలయ్య బాబు రేంజ్ ఎలా ఉందో మనమంతా చూస్తేనే ఉన్నాం. రూలర్ చిత్రం తర్వాత 'అఖండ' తో భారీ విజయాన్ని అందుకొని సెకండ్ ఇన్నింగ్స్ ని మొదలు పెట్టిన బాలయ్య, ఆ తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.

Written By:
  • Vicky
  • , Updated On : January 11, 2025 / 02:13 PM IST

    Daku Maharaj

    Follow us on

    Daku Maharaj : సీనియర్ హీరోస్ లో ప్రస్తుతం బాలయ్య బాబు రేంజ్ ఎలా ఉందో మనమంతా చూస్తేనే ఉన్నాం. రూలర్ చిత్రం తర్వాత ‘అఖండ’ తో భారీ విజయాన్ని అందుకొని సెకండ్ ఇన్నింగ్స్ ని మొదలు పెట్టిన బాలయ్య, ఆ తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వరుసగా వీరసింహా రెడ్డి, భగవంత్ కేసరి చిత్రాలతో సూపర్ హిట్స్ ని అందుకొని కెరీర్ లో ఎన్నడూ చూడని కలెక్షన్స్ ని చూసాడు. ఇప్పుడు ఆయన ‘డాకు మహారాజ్’ చిత్రంతో రేపు మన ముందుకు రాబోతున్నాడు. బాలయ్య కెరీర్ ఈ రేంజ్ లో ఉండడానికి సంగీత దర్శకుడు తమన్ కూడా ఒక కారణం అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆయన గత మూడు చిత్రాలు అంత పెద్ద హిట్ అవ్వడానికి ప్రధాన కారణాలలో తమన్ కూడా ఒకడు. మామూలు సన్నివేశాలను కూడా తన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో వేరే లెవెల్ కి తీసుకెళ్లాడు.

    ఇప్పుడు ‘డాకు మహారాజ్’ చిత్రానికి కూడా అదే రేంజ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించాడు. నిన్న జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తమన్ బాలయ్య గురించి ఎమోషనల్ గా మాట్లాడిన కొన్ని మాటలు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది. ఆయన మాట్లాడుతూ ‘బాలయ్య గారి ఏమి చెప్పాలి. మా అమ్మ నాకు ఫోన్ చేస్తుంది. రెండు మంత్రాలు చెప్తుంది. ఈరోజు అలా ఇలా చేసుకోరా అన్ని చెప్తుంది. ఆ తర్వాత నాకు బాలయ్య నుండి ఫోన్ ద్వారా ఆశీస్సులు వస్తుంది. నా జీవితం లో తండ్రి లేని లోటు అతను ముందు ఉండేది. కానీ బాలయ్య గారిని నేను నా కన్న తండ్రి లాగా భావిస్తాను. ఆయన నాకేదో సినిమా ఆఫర్లు ఇస్తున్నాడు కదా అని నేను ఇదంతా చెప్పట్లేదు’.

    ‘మనం మూడు వందల మంది కలిసి ఒక ఫ్లైట్ లో వెళ్తాము పైలట్ మీద గుడ్డి నమ్మకం పెట్టి. వాడు మనం అనుకున్న ప్రాంతానికి తీసుకెళ్తాడా?, లేకపోతే మధ్యలోనే ఫ్లైట్ ని కూల్చేసి చంపేస్తాడా అనేది మనకి తెలీదు. అంత గుడ్డి నమ్మకం ఆ పైలట్ మీద పెడుతాం. నా మీద బాలయ్య బాబు కూడా అలాంటి నమ్మకమే పెట్టాడు. తమన్ ఉన్నాడు, అతను చూసుకుంటాడు లే అనే బలమైన నమ్మకం నా మీద పెట్టడం వల్లే, నేను ఆయన ప్రతీ సినిమాకి ప్రాణం పెట్టి పనిచేస్తాను’ అంటూ చెప్పుకొచ్చాడు. బాలయ్య గురించి ఇంత ఎమోషనల్ గా తమన్ ఇంతకు ముందు ఎప్పుడూ మాట్లాడలేదు. నాలుగు సినిమాలు కలిసి పని చేసిన అనుభవం కారణంగా వాళ్ళిద్దరి మధ్య ఈ రేంజ్ బంధం ఏర్పడింది అనొచ్చు. థియేట్రికల్ ట్రైలర్ లో ఆయన అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఎంత గొప్పగా ఉన్నిందో మనమంతా చూసాము. సినిమాలో అంతకు మించి పది రెట్లు ఉంటుందట.