Tamannah: మాస్టర్ చెఫ్ తెలుగు షో పై చట్టపరంగా చర్యలు తీసుకోబోతున్న… మిల్కీ బ్యూటీ తమన్నా

Tamannah: మిల్కీ బ్యూటీ తమన్నా… హ్యాపీడేస్ సినిమాతో తెలుగులో మంచి గుర్తింపు దక్కించుకుంది ఈ నటి. ఆ తర్వాత తర్వాత వరుస సినిమాలతో దూసుకుపోతూ యంగ్ హీరోల నుంచి స్టార్ హీరోల వరకు అందరితో నటించి మెప్పించింది. ఇండస్ట్రీకి వచ్చి 15 సమత్సరాలు గడుస్తున్నా… ఇప్పటికి టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ల లిస్టులో తమన్నా ఉండటం గమనార్హం. అయితే తమన్నా భాటియాకు తాజాగా ఊహించని షాక్ తగిలింది. ఇటీవల సిటీమార్, మాస్ట్రో సినిమాలలో ప్రేక్షకులను అలరించింది ఈ […]

Written By: Raghava Rao Gara, Updated On : October 23, 2021 8:15 pm
Follow us on

Tamannah: మిల్కీ బ్యూటీ తమన్నా… హ్యాపీడేస్ సినిమాతో తెలుగులో మంచి గుర్తింపు దక్కించుకుంది ఈ నటి. ఆ తర్వాత తర్వాత వరుస సినిమాలతో దూసుకుపోతూ యంగ్ హీరోల నుంచి స్టార్ హీరోల వరకు అందరితో నటించి మెప్పించింది. ఇండస్ట్రీకి వచ్చి 15 సమత్సరాలు గడుస్తున్నా… ఇప్పటికి టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ల లిస్టులో తమన్నా ఉండటం గమనార్హం. అయితే తమన్నా భాటియాకు తాజాగా ఊహించని షాక్ తగిలింది.

ఇటీవల సిటీమార్, మాస్ట్రో సినిమాలలో ప్రేక్షకులను అలరించింది ఈ ముద్దుగుమ్మ. అలానే పలు వెబ్ సిరీస్ ల లోనూ నటిస్తూ తన సత్తా చాటుతుంది. 11త్ అవర్, నవంబర్ స్టోరీస్ లాంటి వెబ్ సిరీస్ లతో వచ్చి ఆకట్టుకుంది. అయితే ఇటీవల జెమినీ టీవీ లో మాస్టర్ చెఫ్ తెలుగు అనే రియాల్టీ షో కు వ్యాఖ్యాతగా వ్యవహరించి తన లోని మరో యాంగిల్ ను బయట పెట్టింది. సినిమా షూటింగ్ కారణంగా షెడ్యూలు కు అందలేదని సమాచారం. దీంతో తమన్నా స్థానంలో… అనసూయను యాంకర్ గా పెట్టడం తెలిసిందే.

అయితే దీనిపై తీవ్ర తమన్నా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారంట. మాస్టర్ చెఫ్ తెలుగుపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకుందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ఈ మేరకు తమన్నా న్యాయవాది… మాస్టర్ చెఫ్ తెలుగు ప్రోగ్రాంపై కేసు కూడా వేసినట్లు సమాచారం అందుతోంది. బకాయిలు చెల్లించకపోవడం, ప్రొడక్షన్ హౌస్ ఇన్నోవేటివ్ ఫిల్మ్ అకాడమీ ద్వారా అనైతిక ప్రవర్తన కారణంగా మాస్టర్‌చెఫ్ తెలుగుపై కేసు వేసినట్లు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.