https://oktelugu.com/

Peddanna Movie: వాడికి అడ్డులేదు, ఒడ్డు లేదు అంటూ దూసుకొస్తున్న రజిని… ” పెద్దన్న” టీజర్ రిలీజ్

Peddanna Movie: సూపర్ స్టార్ రజిని కాంత్  నటించిన సినిమా ‘అన్నాత్తే’. దీనిని తెలుగులో ‘పెద్దన్న’ పేరుతో డబ్ చేసి ఇరు తెలుగు రాష్ట్రాల్లోనూ  రిలీజ్ చేస్తున్నారు. దసరా పండగ కానుకగా ఈ సినిమాకు పెద్దన్న టైటిల్‌ ఖరారు చేస్తూ ఓ పోస్టర్‌ను మూవీ యూనిట్ రిలీజ్ చేశారు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. అయితే ఇప్పుడు తాజాగా పెద్దన్న చిత్ర బృందం రజిని అభిమానులకు ఓ స్వీట్ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : October 23, 2021 / 07:46 PM IST
    Follow us on

    Peddanna Movie: సూపర్ స్టార్ రజిని కాంత్  నటించిన సినిమా ‘అన్నాత్తే’. దీనిని తెలుగులో ‘పెద్దన్న’ పేరుతో డబ్ చేసి ఇరు తెలుగు రాష్ట్రాల్లోనూ  రిలీజ్ చేస్తున్నారు. దసరా పండగ కానుకగా ఈ సినిమాకు పెద్దన్న టైటిల్‌ ఖరారు చేస్తూ ఓ పోస్టర్‌ను మూవీ యూనిట్ రిలీజ్ చేశారు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. అయితే ఇప్పుడు తాజాగా పెద్దన్న చిత్ర బృందం రజిని అభిమానులకు ఓ స్వీట్ సర్ ప్రైజ్ ఇచ్చింది.

    విక్టరీ వెంకటేష్ చేతుల మీదుగా  పెద్దన్న మూవీ  టీజర్  ను విడుదల చేయించారు. ఈ మేరకు వెంకీ సోషల్ మీడియా ద్వారా ఈ టీజర్  పోస్ట్ చేసి… ఈ సినిమా మంచి విజయం సాధించాలని తన విషెస్ ని తెలియజేశారు.  ఈ వీడియో  లో రాయల్ ఎన్‌ఫీల్డ్ పై వస్తోన్న రజినీకాంత్ లుక్ మాసీగా ఉంది. ముఖ్యంగా విజువల్స్, రజిని డైలాగ్స్ మేజర్ హైలైట్ అని చెప్పాలి. టీజర్ చివర్లో రజిని మీసం తిప్పుతూ బాంబులు పేలుతూ ఉంటే నడిచి వెళ్ళే సీన్ కి అయితే ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తుందని పక్కాగా చెప్పొచ్చు.

    ఈ సినిమా ను తమిళ స్టార్ డైరెక్టర్ శివ తెరకెక్కిస్తుండగా … సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇక ఇందులో లేడీ సూపర్ స్టార్ నయనతార, కుష్బూ, మీనా , కీర్తి సురేష్  ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. దీపావళి కానుకగా నవంబర్ 4న ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీని  విడుదల చేస్తున్నారు. తెలుగులో ఈ సినిమా హక్కులను ఏషియన్ సినిమాస్.. రూ. 12 కోట్లకు కొనుగోలు చేసినట్టు సమాచారం.