Etela Rajendar: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నదే నిజమైంది. హుజూరాబాద్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ రహస్యంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కలిశాడన్నది అక్షరాల నిజం అని తేలింది. దీంతో జాతీయ పార్టీలైన బీజేపీ,, కాంగ్రెస్ లు దేశవ్యాప్తంగా కొట్లాడుకుంటుంటే తెలంగాణలో మాత్రం దోస్తీ చేస్తున్నాయన్న కేటీఆర్ ఆరోపణలు నిజం అని తేలింది. ఇది రాజకీయంగా సంచలనంగా మారింది.
హుజూరాబాద్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఓ కఠిన నిజాన్ని ఒప్పుకున్నారు. అదిప్పుడు తెలంగాణ రాజకీయాలను షేక్ చేసే అంశమైంది. ఉప్పు నిప్పులుగా ఉండే జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ లు తెలంగాణ గల్లీలో కలిసిపోయాయన్న కఠిన వాస్తవం బయటపడింది.
రెండు పార్టీల మధ్య ఇప్పుడు ఈ పరిణామం హుజూరాబాద్ రాజకీయాలను ప్రభావితం చేసేలా తయారయ్యాయి. ఈ క్రమంలోనే ఈటల రాజేందర్ నష్టనివారణ చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది. అందుకే నిజాన్ని ఒప్పుకున్నారు.
తాను రేవంత్ రెడ్డిని కలిసిన మాట వాస్తవమేనన్నారు. గోల్కొండ రిసార్ట్ లో కాంగ్రెస్ అధ్యక్షుడిని.. హుజూరాబాద్ బీజేపీ అభ్యర్థి కలిశాడన్న పదమే ఇప్పుడు వైరల్ అయ్యింది. అదిప్పుడు తెలంగాణ రాజకీయాలను షేక్ చేస్తోంది. రేవంత్ రెడ్డిని ఈటల కలిశాడని తెలియడంతో జాతీయ పార్టీల తెలంగాణ పొత్తు బయటపడింది. ఎప్పుడూ కలవని వీరి పొత్తు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. హుజూరాబాద్ లో మైనస్ గా మారింది.