Tamannaah- Vijay Varma: ఇండియాలో లిప్ కిస్ ఇప్పటికీ సెన్సేషనే. దాన్నో సహసకృత్యంగా ఇండియన్ సొసైటీ చూస్తుంది. ఓ హీరోయిన్ లిప్ కిస్ సన్నివేశాల్లో నటిస్తే ప్రముఖంగా చెప్పుకుంటున్నారు. మిల్కీ బ్యూటీ తమన్నా ఈ మధ్య విచ్చలవిడిగా లిప్ కిస్ లు లాగించేస్తుంది. బోల్డ్ కంటెంట్ వెబ్ సిరీస్లలో నటిస్తున్న తమన్నా బెడ్ రూమ్ సన్నివేశాల్లో మొహమాటం లేకుండా నటిస్తుంది. అమెజాన్ ప్రైమ్ లో జీ కర్దా టైటిల్ తో ఓ సిరీస్ ప్రసారం అవుతుంది. ఇందులో తమన్నా ప్రధాన పాత్ర చేశారు. శృంగార సన్నివేశాలు ఉన్నాయి.
ఇక లస్ట్ స్టోరీస్ 2 అయితే సరేసరి. నటుడు విజయ్ వర్మతో ఆమె శృంగార సన్నివేశాలు, లిప్ లాక్ సీన్స్ లో నటించారు. ఇలాంటి బోల్డ్ సీన్స్ లో నటించడం పై తమన్నా ఓపెన్ అయ్యారు. ఈరోజుల్లో కూడా శృంగార సన్నివేశాల్లో నటించడాన్ని తప్పుగా చూడటం ఏమిటంటున్నారు. పాత్ర డిమాండ్ చేసినప్పుడు అలాంటి సన్నివేశాల్లో నటిస్తాము, అందులో తప్పేముంది అన్నట్లు తమన్నా చెప్పుకొచ్చింది.
మరో ఇంటర్వ్యూలో తమన్నాకు ఓ బోల్డ్ క్వశ్చన్ ఎదురైంది. మీరు ఫస్ట్ డేట్ లోనే శృంగారం చేశారా? అని అడగ్గా నాకు అలాంటి అనుభవం ఇంకా కాలేదని సమాధానం చెప్పాడు. ఆ పక్కనే ఉన్న విజయ్ వర్మ మాత్రం నాకు కచ్చితంగా శృంగారం ఉండాల్సిందే అన్నారు. దర్శకుడు సుజోయ్ మాత్రం నాకు అంత అదృష్టం లేదన్నాడు. మరి సెకండ్ డేట్ లోనైనా శృంగారం చేశావా? అని విజయ్ దర్శకుడు సుజోయ్ ని అడగ్గా… నాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మొదటి నుండి స్ట్రగుల్స్. ఇలాంటి డేటింగ్ వ్యవహారాలు లేవన్నాడు.
అదే ఇంటర్వ్యూలో నేను లిప్ కిస్ చేసిన మొట్టమొదటి నటుడు విజయ్ వర్మ అని తమన్నా ఓపెన్ అయ్యింది. లస్ట్ స్టోరీస్ 2లో వీరిద్దరి మధ్య శృంగార సన్నివేశాలున్న నేపథ్యంలో అతన్ని కిస్ చేశానని తమన్నా ఒప్పుకున్నారు. జూన్ 29 నుండి లస్ట్ స్టోరీస్ 2 స్ట్రీమ్ అవుతుంది. ప్రస్తుతం తమన్నా తెలుగులో భోళా శంకర్ మూవీ చేస్తున్నారు. ఆగస్టు 11న అది విడుదల కానుంది.