https://oktelugu.com/

Heroine Tamannaah : రొమాంటిక్ సన్నివేశాలే ఇప్పుడు నా కెరీర్ ని నిలబెట్టింది..అవసరానికి తప్పదు అంటూ తమన్నా బోల్డ్ కామెంట్స్!

రొమాంటిక్ సన్నివేశాల్లో మాత్రమే కాదు, అడల్ట్ రేటెడ్ సన్నివేశాల్లో కూడా ఆమె నటించేస్తుంది, డైలాగ్స్ కూడా వినకూడనివి ఆమె నోటి నుండి వస్తున్నాయి, 'లస్ట్ స్టోరీస్ 2' లో ఈమె చేసిన రొమాంటిక్ సన్నివేశాలు సోషల్ మీడియా లో ప్రకంపనలు రేపింది. ఈమధ్య కాలం లో తమన్నా అలాంటి సినిమాలనే ఒప్పుకుంటుంది.

Written By:
  • Vicky
  • , Updated On : October 1, 2024 / 08:59 PM IST

    Heroine Tamannaah

    Follow us on

    Heroine Tamannaah :  ఎంతమంది హీరోయిన్లు వచ్చినా చెక్కు చెదరని క్రేజ్ తో ఇప్పటికీ టాప్ రేంజ్ లో కొనసాగుతున్న హీరోయిన్స్ లో ఒకరు తమన్నా. ఈమె మంచు మనోజ్ హీరో గా నటించిన ‘శ్రీ’ చిత్రం ద్వారా ఇండస్ట్రీ కి హీరోయిన్ గా పరిచయమైంది. ఆ సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు. ఆ తర్వాత తమిళం లో పలు సినిమాలు చేసింది. అక్కడ ఈమె ‘కేడీ’ అనే చిత్రం ద్వారా నెగటివ్ రోల్ తో తమిళ ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది. కానీ తమన్నా లో ఉన్న అందం, ఆమె చలాకీతనం, యాక్టింగ్ టాలెంట్ ని గమనించిన దర్శక నిర్మాతలు ఫ్లాప్స్ వచ్చినప్పటికీ కూడా అవకాశాలు ఇచ్చారు. అలాంటి సమయంలో శేఖర్ కమ్ముల దర్శకత్వం లో తెరకెక్కిన ‘హ్యాపీ డేస్’ చిత్రం లో హీరోయిన్ గా నటించి భారీ సక్సెస్ ని అందుకుంది. ఈ చిత్రం తర్వాత ఆమె మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.

    వరుసగా హిట్టు మీద హిట్టు కొడుతూ అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోలందరితో నటించి సౌత్ లో మంచి స్టార్దమ్ ని సంపాదించింది. అయితే కొత్తగా వచ్చే హీరోయిన్లు కెరీర్ ప్రారంభం లో డైరెక్టర్స్ ఎలాంటి సన్నివేశం చేయమన్నా చేసేవారు. ముఖ్యంగా రొమాంటిక్ సన్నివేశాల్లో నటించాల్సి వస్తే అసలు వెనకాడేవారు కాదు. కానీ తమన్నా మాత్రం రొమాంటిక్ సన్నివేశాలకు నో చెప్పేది. ఒకవేళ సినిమాలో సన్నివేశానికి అత్యవసరం అయితే అయిష్టం గా, నామమాత్రంగానే నటించేది. ఆ తర్వాత స్టార్ అయ్యాక ఆమె రొమాంటిక్ సన్నివేశాలకు ససేమీరా నో చెప్పేది. ఎందుకంటే నా సినిమాని మా కుటుంబ సభ్యులు చూస్తారు, వాళ్ళు తల దించుకునేలా నేను చేయకూడదు, అందుకే నేను అలాంటి సన్నివేశాల్లో నటించను అని చెప్పుకొచ్చింది. ఈ క్రమం లో ఆమె ఎన్నో క్రేజీ ప్రాజెక్ట్స్ ని వదులుకోవాల్సి వచ్చిన వెనకడుగు వేయలేదు. అలా తనకు తాను కచ్చితమైన గీత గీసుకున్న తమన్నా, ఈమధ్య కాలం లో అలాంటి సన్నివేశాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన సంగతి తెలిసిందే.

    రొమాంటిక్ సన్నివేశాల్లో మాత్రమే కాదు, అడల్ట్ రేటెడ్ సన్నివేశాల్లో కూడా ఆమె నటించేస్తుంది, డైలాగ్స్ కూడా వినకూడనివి ఆమె నోటి నుండి వస్తున్నాయి, ‘లస్ట్ స్టోరీస్ 2’ లో ఈమె చేసిన రొమాంటిక్ సన్నివేశాలు సోషల్ మీడియా లో ప్రకంపనలు రేపింది. ఈమధ్య కాలం లో తమన్నా అలాంటి సినిమాలనే ఒప్పుకుంటుంది. దీని గురించి రీసెంట్ ఇంటర్వ్యూ లో ఆమె మాట్లాడుతూ ‘ఆడియన్స్ ఈమధ్య అలాంటివి ఎక్కువగా కోరుకుంటున్నారు కాబట్టి వాళ్ళ అభిరుచికి తగ్గట్టుగా నేను కూడా మారాను. పోటీ రంగం లో నెగ్గుకురావాలంటే ఇలాంటివి చేయక తప్పదు’ అంటూ చెప్పుకొచ్చింది. తమన్నా లో ఈ మార్పుని చూసిన అభిమానులు షాక్ కి గురయ్యారు. ఇకపోతే తమన్నా రీసెంట్ గానే ‘బాక్’ అనే చిత్రం ద్వారా మన ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. కమర్షియల్ గా ఈ చిత్రం పెద్ద హిట్ అయ్యింది, ప్రస్తుతం ఆమె సంపత్ నంది దర్శకత్వం లో ‘ఓడేలా 2’ లో నటిస్తుంది.