https://oktelugu.com/

 Heroine Rambha Daughter : హీరోయిన్ రంభ కూతురు లేటెస్ట్ ఫోటోలు చూసారా..? ఈమె సినిమాల్లోకి వస్తే స్టార్ హీరోయిన్ల కెరీర్స్ ప్రమాదంలో పడినట్టే!

2010 వ సంవత్సరం లో ఈమె ఇంద్ర కుమార్ అనే ప్రముఖ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ని పెళ్లి చేసుకుంది. ఈ దంపతులిద్దరికీ ఇద్దరు కూతుర్లు, ఒక కొడుకు ఉన్నాడు. కొడుకు రీసెంట్ గానే పుట్టాడు. పెద్ద కూతురుకి సంబంధించిన లేటెస్ట్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది.

Written By:
  • Vicky
  • , Updated On : October 1, 2024 / 08:50 PM IST

    Heroine Rambha Daughter

    Follow us on

    Heroine Rambha Daughter : 1990 దశకం లో యూత్ ఆడియన్స్ ని పిచ్చెక్కిపోయేలా చేసిన హీరోయిన్స్ లో ఒకరు రంభ. విజయవాడ కి చెందిన ఈ అచ్చ తెలుగు అమ్మాయిని ప్రముఖ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ మన ఇండస్ట్రీ కి పరిచయం చేసాడు. తొలుత ఈమె పేరు విజయ లక్ష్మి. కానీ ఈవీవీ సూచన మేరకు ఈమె తన పేరుని మార్చుకుంది. ఆయన తెరకెక్కించిన ‘ఆ ఒక్కటి అడక్కు’ సినిమా ద్వారా ఇండస్ట్రీ కి పరిచయమైన ఈమె తొలి సినిమాతోనే తన అందం, నటన, డ్యాన్స్ తో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఆ సినిమా బంపర్ హిట్ అవ్వడంతో రంభకు మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వరుసగా ఈమెకి ఆరంభం లోనే స్టార్ హీరోల సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. ఆమె అదృష్టం బాగుండడంతో అప్పట్లో ఆ సినిమాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. ప్రస్తుతం తరం లో శ్రీలీల ఎంతటి సెన్సేషన్ ని సృష్టించిందో, అప్పట్లో రంభ అంతకు పది రెట్లు ఎక్కువ సెన్సేషన్ ని సృష్టించింది.

    అలా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన రెండు మూడేళ్ళ లోపే ఆమె స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. తెలుగు తో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో హీరోయిన్ గా నటించి పాన్ ఇండియా లెవెల్ లో దుమ్ము లేపేసింది. ఒక తెలుగు అమ్మాయి ఇండస్ట్రీ లో ఆ స్థాయికి ఎదగడం రంభ విషయం లోనే జరిగింది. ఇప్పటికీ కూడా ఈమె హీరోయిన్ గా మళ్ళీ సినిమాలు చేసేయొచ్చు. అంత అందం గా ఉంటుంది, కానీ పెళ్లి తర్వాత ఇక సినిమాలు ఒద్దు అని తన కెరీర్ ని మొత్తం పక్కన పెట్టి కేవలం ఒక గృహిణి గా మాత్రమే కొనసాగుతుంది. ఆమె చివరిసారిగా వెండితెర మీద కనిపించిన చిత్రం ‘దొంగ సచ్చినోళ్ళు’. ఈ సినిమా 2008 వ సంవత్సరం లో విడుదలైంది. ఈ చిత్రానికి ముందు ఆమె ఎన్టీఆర్ యమదొంగ చిత్రం లో ‘నాచోరే నాచోరే’ సాంగ్ లో కనిపించింది. ఈ పాటలో ఆమె ఎన్టీఆర్ తో సమానంగా ఎంత అద్భుతంగా డ్యాన్స్ వేసిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.

    ఇది ఇలా ఉండగా 2010 వ సంవత్సరం లో ఈమె ఇంద్ర కుమార్ అనే ప్రముఖ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ని పెళ్లి చేసుకుంది. ఈ దంపతులిద్దరికీ ఇద్దరు కూతుర్లు, ఒక కొడుకు ఉన్నాడు. కొడుకు రీసెంట్ గానే పుట్టాడు. పెద్ద కూతురుకి సంబంధించిన లేటెస్ట్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది. రీసెంట్ గా రంభ తన కుటుంబం తో కలిసి ఒక బీచ్ కి వెళ్ళింది. అక్కడ ఆమె కుటుంబ సమేతంగా తీసుకున్న ఫోటోలు బాగా వైరల్ అయ్యాయి. అందులో రంభ పెద్ద కూతురుని చూసిన ప్రతీ ఒక్కరు, అచ్చు గుద్దినట్టు అమ్మ పోలికలే ఉన్నాయి, సినిమాల్లోకి వస్తే పెద్ద స్టార్ హీరోయిన్ అయిపోతుంది, ఇప్పుడు ఉన్నోల్లందరూ ఈమె దెబ్బకి ఫేడ్ అవుట్ అయిపోతారు అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్స్.

                                                                                                    Rambha Family