https://oktelugu.com/

OTT Movie : విడుదలైన వారంలోపే ఓటీటీ లోక కార్తీ ‘సత్యం సుందరం’..ఎందులో చూడాలంటే!

ఈ సినిమాలో కార్తీ తో పాటు, అరవింద స్వామి కూడా మరో హీరో గా నటించాడు. సినిమా స్క్రీన్ ప్లే, కథ మొత్తం ఈ ఇద్దరి మధ్య మాత్రమే తిరుగుతుంది. మరో నటులు కనిపించరు. పాటలు, ఫైట్స్, డ్యాన్స్ , యాక్షన్, హీరోయిన్ ఇవేమి లేకుండా, కేవలం భావోద్వేగాలను మాత్రమే వెండితెర మీద ఆవిష్కరించిన ఈ సినిమాకి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

Written By:
  • Vicky
  • , Updated On : October 1, 2024 / 09:06 PM IST

    Sathyam Sundharam movie

    Follow us on

    OTT Movie :  విభిన్నమైన కథాంశాలతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించే తమిళ హీరో కార్తీ కి మన టాలీవుడ్ లో ఎంత మంది క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తమిళ ఆడియన్స్ కంటే తెలుగు ఆడియన్స్ గొప్పోళ్ళు అంటూ అనేక ఈవెంట్స్ లో మాట్లాడిన కార్తీని, మన తెలుగు ఆడియన్స్ కూడా ఇక్కడి హీరోలాగానే చూస్తారు. అందుకే ఆయన సినిమాలకు టాక్ వస్తే థియేటర్స్ కి క్యూలు కడుతారు. రీసెంట్ గా ఆయన ‘సత్యం సుందరం’ అనే ఎమోషనల్ డ్రామా ని తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేసాడు. ఈ సినిమాలో కార్తీ తో పాటు, అరవింద స్వామి కూడా మరో హీరో గా నటించాడు. సినిమా స్క్రీన్ ప్లే, కథ మొత్తం ఈ ఇద్దరి మధ్య మాత్రమే తిరుగుతుంది. మరో నటులు కనిపించరు. పాటలు, ఫైట్స్, డ్యాన్స్ , యాక్షన్, హీరోయిన్ ఇవేమి లేకుండా, కేవలం భావోద్వేగాలను మాత్రమే వెండితెర మీద ఆవిష్కరించిన ఈ సినిమాకి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

    రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం కేవలం వీకెండ్ తోనే బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకున్నాయి. ప్రస్తుతం లాభాల్లో నడుస్తున్న ఈ చిత్రం లాంగ్ రన్ ఇప్పట్లో ఆగేలా లేదు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా సక్సెస్ మీట్ లో కార్తీ మాట్లాడుతూ ‘ఖైదీ చిత్రం చేస్తున్నప్పుడు, నాకు ఈ సినిమా థియేటర్స్ లో ఆడుతుందా అనే సందేహం ఉండేది. ఎందుకంటే ఆ చిత్రంలో హీరోయిన్ ఉండదు, పాటలు ఉండవు. కానీ ఆ చిత్రం కమర్షియల్ గా పెద్ద హిట్ అయ్యింది. అప్పుడు నాకు అర్థమైంది, కొత్త తరహా లో ప్రయత్నిస్తే ఆడియన్స్ కచ్చితంగా ఆదరిస్తారు అని. ‘సత్యం సుందరం’ స్క్రిప్ట్ కూడా నా దగ్గరకి వచ్చినప్పుడు, ఖైదీ చిత్రానికి కలిగిన అనుమానమే కలిగింది. ఈ సినిమాలో పాటలు లేవు, ఫైట్స్ లేవు, ఏమి లేవు, ఇలాంటి సినిమాలు ఎక్కడ ఆడుతాయి?, కచ్చితంగా ఈ చిత్రం చేద్దాం కానీ, డైరెక్ట్ గా ఓటీటీ లో విడుదల చేద్దామని డైరెక్టర్ తో అన్నాను.

    కానీ డైరెక్టర్ లేదు సార్ ఈ సినిమా థియేటర్స్ లో విడుదల చేయాలి, కచ్చితంగా పెద్ద హిట్ అవుతుంది అన్నాడు, చేసాము పెద్ద హిట్ అయ్యింది, భవిష్యత్తులో ఇలాంటి సినిమాలు ఇంకా చేస్తాను’ అంటూ చెప్పుకొచ్చాడు కార్తీ. ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి సంబంధించిన ఓటీటీ విడుదల తేదీ కూడా బయటకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ ఈ చిత్రాన్ని భారీ రేట్ కి కొనుగోలు చేసింది. వాళ్ళతో కుదిరించుకున్న ఒప్పందం ప్రకారం ఈ సినిమాని నవంబర్ 14 న దీపావళి సందర్భంగా ఓటీటీ లో విడుదల చేయాలట. సినిమా రన్ ఆగిపోతే ఇంకా ముందే ఓటీటీ లో విడుదల అవ్వొచ్చని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఈ నెలాఖరున దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా చేయబోతున్నారట.

    Tags