Balakrishna- Tamannaah: వీరసింహారెడ్డి తరువాత బాలకృష్ణ ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా అనిల్ రావిపూడి సినిమాకు ఓకే చెప్పాడు. ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ ఇప్పటికే రిలీజ్ చేయడంతో ఫ్యాన్స్ సినిమా కోసం ఆవురావురుమంటూ ఎదురుచూస్తున్నారు. ఇంతలో #NBK108 గురించి హాట్ టాపిక్ ఒకటి వైరల్ అవుతోంది. షైన్ స్క్రీన్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలకృష్ణకు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. స్టార్ డం కోసం కష్టపడుతున్న శ్రీ లీల బాలయ్య కూతురిగా కనిపిస్తారు. ఈ తరుణంలో లేటేస్టుగా మరో న్యూస్ సినీ సర్కిల్లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో తమన్నా కూడా తన హాట్ డ్యాన్స్ తో కనిపించనుంది. అయితే ఆమె ఈ సాంగ్ కోసం డిమాండ్ చేసిన రెమ్యూనరేషన్ పై హాట్ టాపిక్ అవుతోంది.
తమన్నా ఇప్పటికే పలు సినిమాల్లో ఐటెం సాంగ్ గా కనిపించి ఆకట్టుకున్నారు. మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో ఊరమాస్ లెవల్లో సూపర్ స్టార్ తో డ్యాన్స్ చేయించింది. లేటేస్టుగా ఈ మిల్క్ బ్యూటీ బాలయ్య సినిమాలోనూ ప్రత్యేక సాంగ్ లో కనిపించనుందట. ఈ మధ్య కాలంలో స్టార్ హీరోయిన్లతోనే ప్రత్యేక సాంగ్స్ లో డ్యాన్స్ చేయిస్తున్నారు. కొంచెం రెమ్యూనరేషన్ ఎక్కువైనా ఫ్యాన్స్ ఆకట్టుకోవడానికి డైరెక్లర్లు ఈ పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా తమన్నా కళ్లు చెదిరే పారితోషికాన్ని డిమాండ్ చేసిందట.
ఈ సినిమాలో ప్రత్యేక సాంగ్ లో కనిపించడానికి ఈ భామ ఏకంగా రూ.1.5 కోట్లు అడిగిందట. గతంలో సినిమాల్లో నటించినందుకు కోటి లోపే పారితోషికం అందుకున్న ఈమె కేవలం ఒక్క సాంగ్ కే ఇంత డిమాండ్ చేయడంపై ఆశ్చర్యపోతున్నారు. అయితే తమన్నాకు ఉన్న డిమాండ్ అలాంటిదని భావించి నిర్మాతలు తమన్నా చెప్పిన రేటుకు ఓకే చెప్పేశారట.దీంతో ఈ భామ బాలయ్య తో కలిసి స్టెప్పులు వేయనుందన్న మాట.
అనిల్ రావిపూడి సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ కచ్చితంగా ఉంటుంది. అయనకు తోడుగా తమన్ ఉంటే ఆ సినిమాలో ప్రత్యేక సాంగ్ బంపర్ హిట్టవుతుంది. ఇప్పుడు బాలయ్య సినిమాలో కూడా స్పెషల్ సాంగ్ అలరించేలా తమన్ పాటను కూడా రెడీ చేసుకుంటున్నాడట. ఇదిలా ఉండగా ఇందులో విలన్ గా బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే #NBK108 షూటింగ్ స్టార్ట్ అయిపోయినట్లు సమాచారం.