రవితేజకు షాకిచ్చిన మిల్కీ బ్యూటీ..!

మాస్ మాహారాజ్ రవితేజకు గత కొన్నాళ్లుగా చెప్పుకోదగ్గ హిట్లు రావడం లేదు. ఒకప్పుడు టాలీవుడ్ రికార్డులు తిరిగిరాసిన రవితేజ ప్రస్తుతం ఒక్క హిట్టు కోసం నానాతంటాలు పడుతున్నాడు. ఇటీవల రవితేజ నటించిన ‘నేల టిక్కెట్టు’, ‘డిస్కోరాజా’, ‘అమర్ అక్బర్ అంటోని’ మూవీలు ప్లాప్ టాక్ మూటగట్టుకున్నాయి. అయిప్పటికీ దర్శకులు మాత్రం రవితేజతో సినిమాలు చేసేందుకు ఏమాత్రం వెనుకాడటం లేదు. రవితేజ వరుస సినిమాలు చేస్తూ హిట్టు కోసం తనవంతు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఒక్క హిట్టుకొడితే టాలీవుడ్లో […]

Written By: Neelambaram, Updated On : May 15, 2020 6:31 pm
Follow us on


మాస్ మాహారాజ్ రవితేజకు గత కొన్నాళ్లుగా చెప్పుకోదగ్గ హిట్లు రావడం లేదు. ఒకప్పుడు టాలీవుడ్ రికార్డులు తిరిగిరాసిన రవితేజ ప్రస్తుతం ఒక్క హిట్టు కోసం నానాతంటాలు పడుతున్నాడు. ఇటీవల రవితేజ నటించిన ‘నేల టిక్కెట్టు’, ‘డిస్కోరాజా’, ‘అమర్ అక్బర్ అంటోని’ మూవీలు ప్లాప్ టాక్ మూటగట్టుకున్నాయి. అయిప్పటికీ దర్శకులు మాత్రం రవితేజతో సినిమాలు చేసేందుకు ఏమాత్రం వెనుకాడటం లేదు. రవితేజ వరుస సినిమాలు చేస్తూ హిట్టు కోసం తనవంతు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఒక్క హిట్టుకొడితే టాలీవుడ్లో రవితేజ మార్కెట్లో పుంజుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

తాజాగా రవితేజ గోపి మాలినేని దర్శకత్వంలో ‘క్రాక్’ అనే మూవీ చేస్తున్నాడు. ఈ మూవీలో రవితేజకు జోడీగా శృతిహాసన్ నటిస్తుంది. శృతిహాసన్-రవితేజ కాంబోలో గతంలో ‘బలుపు’ మూవీ రిలీజై మంచి విజయం సాధించింది. వీరిద్దరి జోడీకి ప్రేక్షకుల్లో మంచి స్పందన ఉండటంతో ఈ మూవీపై రవితేజ భారీ అంచనాలు పెట్టుకున్నాడు. ఇటీవల ‘క్రాక్’ మూవీ నుంచి రిలీజైన పోస్టర్, టీజర్ మంచి స్పందన లభించింది. ఈ మూవీ షూటింగ్ దాదాపు పూర్తయింది. థియేటర్లు తిరిగి ప్రారంభంకాగానే ఈ మూవీని రిలీజ్ చేసేందుకు చిత్రబృందం ఇప్పటికే సన్నహాలు చేస్తుంది.

‘క్రాక్’ తర్వాత రవితేజ నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో నటించనున్నాడు. ఈ మూవీలో రవితేజ సరసన తమన్నాను తీసుకోవాలని దర్శక, నిర్మాతలు భావించారట. ఈమేరకు ఆమెను సంప్రదించగా భారీగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిందని దానికి నిర్మాతలు ఒప్పుకోలేదని ప్రచారం జరుగుతోంది. రవితేజ పక్కన నటించేందుకు తమన్నా ఏకంగా రూ.3కోట్లు డిమాండ్ చేసిందట. అయితే దర్శక, నిర్మాతలు 2.5కోట్లు ఇస్తామని చెప్పినా మిల్కీబ్యూటీ ఒప్పుకోలేదని ఫిల్మీవర్గాల్లో టాక్ విన్పిస్తోంది. ప్లాపులతో ఉన్న రవితేజతో నటించడం ఇష్టంలేకే తమన్నా రెమ్యూనరేషన్ పేరుతో రిజక్ట్ చేసిందనే వార్తలు విన్పిస్తున్నాయి. గతంలో రవితేజతో నటించిన ‘బెంగాల్ టైగర్’ మూవీ కూడా అంతగా సక్సస్ కాలేదు. ప్రస్తుతం తమన్నా గోపిచంద్ హీరోగా నటిస్తున్న ‘సిటీమార్’ మూవీలో కబడ్డీ కోచ్ గా నటిస్తోంది.