Tamannaah comments on Balakrishna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం సీనియర్ హీరోల హవా కొనసాగుతుంది. రీసెంట్ గా చిరంజీవి ‘మన శంకర్ వరప్రసాద్’ సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే గత సంవత్సరం సంక్రాంతి కానుకగా వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో వెంకటేష్ పెను సంచలనాన్ని క్రియేట్ చేశాడు. బాలయ్య కూడా వరుసగా నాలుగు విజయాలను తన ఖాతాలో వేసుకొని ముందుకు దూసుకెళ్తున్నాడు… ‘అఖండ 2’ నిరాశపరిచినప్పటికి ఇప్పుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్న సినిమాతో పెను సంచలనాన్ని క్రియేట్ చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక నాగార్జున ప్రస్తుత తన వందో సినిమా చేస్తున్నాడు. ఇక సీనియర్ హీరోల పక్కన నటించడానికి హీరోయిన్ల కొరత ఉంది. వాళ్ళతో నటిస్తే స్టార్ హీరోయిన్స్ గా అవకాశాలు రావని ఆలోచిస్తున్నారు.
ఇక చిరంజీవి, వెంకటేష్ లతో సినిమాలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తమన్నా బాలయ్య బాబు పక్కన నటించడానికి మాత్రం అన్ కంఫర్ట్ గా ఫీల్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. అందుకోసమే బాలయ్య సినిమాలో ఆఫర్లు వచ్చిన కూడా ఆమె రిజెక్ట్ చేస్తుందట. ఇక ఏది ఏమైనా కూడా సీనియర్ హీరోల పక్కన హీరోయిన్ గా నటించడంలో తమన్నాకి మంచి గుర్తింపైతే ఉంది.
వెంకటేష్ తో ఎఫ్2, ఎఫ్3 సినిమాలను చేసి సక్సెస్ లను సాధించిన ఆమె చిరంజీవితో చేసిన సైరా సినిమాలో సైతం అద్భుతమైన పర్ఫామెన్స్ ఇచ్చింది. ఇక ఈ సినిమాలతో పాటు ఇప్పుడు బాలయ్య గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్న సినిమాలో తమన్నా ను హీరోయిన్ గా అనుకున్నప్పటికి ఆమె చేయడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదట. ఇక దాంతో వేరే హీరోయిన్ ల పేర్లైతే పరిశీలిస్తున్నారు…
ఈ న్యూస్ తెలుసుకున్న బాలయ్య బాబు అభిమానులు సైతం తన పక్కన తమన్నా అంత పెద్దగా సెట్ అవ్వదని వేరే హీరోయిన్ అయితేనే బాగుంటుందని వాళ్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా ఇప్పుడు మరోసారి తన సత్తా చాటుకోవాల్సిన సమయం ఆసన్నమైంది… కాబట్టి గోపీచంద్ మలినేని సినిమాతో భారీ బ్లాక్ బాస్టర్ సక్సెస్ ని సాధించి బాలయ్య మరోసారి కంబ్యాక్ ఇస్తే బాగుంటుందని ప్రతి ఒక్కరు భావిస్తున్నారు…