Tamannaah Bhatia: పాన్ ఇండియా లెవెల్ లో మంచి గుర్తింపుని దక్కించుకున్న హీరోయిన్స్ లో ఒకరు తమన్నా(Thamanna Bhatia). తెలుగు, తమిళం, హిందీ, కన్నడ ఇలా అన్ని భాషల్లోనూ హీరోయిన్ గా నటించి సూపర్ హిట్స్ ని అందుకొని మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించిన తమన్నా, ఇప్పటికీ కుర్ర హీరోయిన్స్ తో పోటీ పడుతూ సినిమాల్లో అవకాశాలను సంపాదిస్తుండడం విశేషం. కెరీర్ ప్రారంభం లో ఎంత అందంగా కనిపించిందో, ఇప్పుడు అంతకు మించిన అందంతో కనిపిస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది ఈ మిల్కీ బ్యూటీ. అయితే రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో ఆమె మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మేడి లో బాగా వైరల్ అయ్యాయి. తమన్నా ఇన్నేళ్ల తన సినీ కెరీర్ లో కేవలం కెరీర్ మీద మాత్రమే ఫోకస్ పెట్టింది కానీ, ప్రేమ, పెళ్లి వైపు ఎప్పుడూ ఆలోచించలేదు.
అయితే రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో తన ప్రేమ గురించి మాట్లాడుతూ ‘టీనేజ్ వయస్సు లో ప్రేమలో పడ్డాను, కానీ సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఆ ప్రేమని త్యాగం చేయాల్సి వచ్చింది’ అంటూ చెప్పుకొచ్చింది. ఇది కాసేపు పక్కన పెడితే తమన్నా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ తో చాలా రోజులు ప్రేమాయణం నడిపింది అనే విషయం మన అందరికీ తెలిసిందే. వీళ్లిద్దరు కలిసి ముంబై లో తిరగని చోటు అంటూ ఏది మిగల్లేదు. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా ఉన్నాయి. ఎప్పుడూ రొమాంటిక్ సన్నివేశాల్లో నటించని తమన్నా, ‘లస్ట్ స్టోరీస్ 2’ లో రెచ్చిపోయి మరీ రొమాంటిక్ సన్నివేశాల్లో నటించింది. ఇంత ఘాటు రొమాన్స్ లో తమన్నా ని చూస్తామని ఆమె అభిమానులు కలలో కూడా ఊహించి ఉండరు. రొమాన్స్ కి నో చెప్పే మీరు, ఇలాంటి సన్నివేశాలు ఎలా చేశారు అని మీడియా రిపోర్టర్ అడగ్గా, విజయ్ వర్మ నా కాబోయే భర్త కాబట్టి, అలాంటి సన్నివేశం చేశాను అంటూ చెప్పుకొచ్చింది.
అలా క్యూట్ రొమాంటిక్ కపుల్ గా కొంత కాలం చర్చల్లో నిల్చిన ఈ జంట, కొన్ని అనుకోని కారణాల వల్ల విడిపోవాల్సి వచ్చింది. రీసెంట్ గా జరిగిన ఈ ఇంటర్వ్యూ లో విజయ్ వర్మ తో తన బ్రేకప్ గురించి పరోక్షంగా మాట్లాడుతూ ‘ అతనితో ఆ బంధం లో ఉండటం నా వ్యక్తిత్వానికి, భవిష్యత్తుకు అత్యంత ప్రమాదకరం అనే విషయాన్నీ గ్రహించి బయటకు వచ్చేశాను’ అంటూ చెప్పుకొచ్చింది తమన్నా. పేరు చెప్పకపోయినా ఇది కచ్చితంగా విజయ్ వర్మ ని ఉద్దేశించి మాట్లాడిన మాటలే అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ అంటున్నారు. మరి ఈ వ్యాఖ్యలపై విజయ్ స్పందిస్తాడో లేదో చూడాలి.