Border 2 Collection Day 5: ‘ధురంధర్’ చిత్రంతో మంచి ఊపు మీదున్న బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కి, రీసెంట్ గా విడుదలైన ‘బోర్డర్ 2′(Border 2 Movie) చిత్రం మరో భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచి రికార్డు స్థాయి వసూళ్లతో బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కి ఊపిరి ఆడనివ్వకుండా చేస్తోంది. 1997 వ సంవత్సరం లో సన్నీ డియోల్ హీరో గా నటించిన ‘బోర్డర్’ చిత్రం కమర్షియల్ గా సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చింది. టీవీ టెలికాస్ట్ లో కూడా ఈ సినిమా ఒక సంచలనం. అలాంటి బ్లాక్ బస్టర్ కి సీక్వెల్ అంటే ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు ఉంటాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఈ సినిమా అత్యద్భుతంగా తెరకెక్కించారు. ఫలితంగా మొదటి లాంగ్ వీకెండ్ భారీ స్థాయిలో వసూళ్లను నమోదు చేసుకుంది. 5 వ రోజు కూడా ట్రేడ్ ని ఆశ్చర్యపరిచే రేంజ్ వసూళ్లను రాబట్టింది.
మొదటి 5 రోజుల్లో వచ్చిన వసూళ్లు ఎంతో వివరంగా చూద్దాం. మొదటి రోజు ఈ చిత్రానికి 32 కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లు వచ్చాయి. మొదటి ఆట నుండే మంచి పాజిటివ్ మౌత్ టాక్ ఉండడం తో రెండవ రోజు ఈ చిత్రానికి మొదటి రోజుకంటే ఎక్కువ నెట్ వసూళ్లు వచ్చాయి. అక్కడి ట్రేడ్ పండితుల లెక్కల ప్రకారం ఈ చిత్రానికి రెండవ రోజున 40.59 కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా మూడవ రోజు 57 కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లు రాగా, నాల్గవ రోజున ఏకంగా 63 కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లు వచ్చాయి. ఇక 5వ రోజు వర్కింగ్ డే అయినప్పటికీ కూడా ఈ చిత్రానికి 23 కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా ఇండియా వైడ్ గా ఈ చిత్రానికి 216.79 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయి.
ఓవరాల్ గా ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రానికి 256 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఈ చిత్రానికి ఇండియా లో వచ్చినంత వసూళ్లు ఓవర్సీస్ బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం రావడం లేదు. అక్కడి ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం చూస్తే ఈ చిత్రానికి కేవలం 34.19 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చినట్టు తెలుస్తోంది. ఓవరాల్ వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి 290 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయట. ఫుల్ రన్ లో ఈ చిత్రం ఇదే జోరు ని కొనసాగిస్తే 600 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను ఈ చిత్రం రాబట్టే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.