https://oktelugu.com/

Tamannaah Bhatia: సౌత్ సినిమాల సక్సెస్ సీక్రెట్ బయటపెట్టిన తమన్నా… బాలీవుడ్ పై కీలక కామెంట్స్

సౌత్ ఇండియా ఊపేస్తుంటే బాలీవుడ్ మాత్రం స్ట్రగుల్ అవుతుంది. బాలీవుడ్ చిత్రాలు ఫెయిల్ కావడానికి, సౌత్ ఇండియా ప్రాంతీయ భాషల చిత్రాలు సక్సెస్ కావడం వెనకున్న రహస్యం బయటపెట్టింది తమన్నా. ఈ క్రమంలో ఆమె ఆసక్తికర కామెంట్స్ చేసింది.

Written By:
  • S Reddy
  • , Updated On : October 5, 2024 / 10:58 AM IST

    Tamannaah Bhatia

    Follow us on

    Tamannaah Bhatia: బాలీవుడ్ స్టార్స్ అక్షయ్ కుమార్, హృతిక్ రోషన్, సల్మాన్ ఖాన్, అమిర్ ఖాన్ వంటి హీరోలు స్ట్రగుల్ అవుతున్నారు. హిట్స్ కోసం సౌత్ ఇండియా దర్శకులను ఆశ్రయిస్తున్నారు. రన్బీర్ కపూర్ కి యానిమల్ రూపంలో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చాడు సందీప్ రెడ్డి వంగ. యానిమల్ రూ. 900 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. రన్బీర్ కపూర్ కెరీర్ హైయెస్ట్ అని చెప్పాలి. అలాగే అట్లీ తెరకెక్కించిన జవాన్ రూ. 1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. షారుఖ్ ఖాన్ కి భారీ విజయం అందించింది.

    ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ దేవర హిందీ వెర్షన్ రూ. 500 కోట్ల మార్కుకి చేరువైంది. తేజా సజ్జా హనుమాన్, నిఖిల్ హీరోగా నటించిన కార్తికేయ 2 సైతం బాలీవుడ్ లో సత్తా చాటాయి. ఓ మోస్తరు హీరోలు కూడా బాలీవుడ్ బాక్సాఫీస్ ని కుమ్మేస్తున్నారు. ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ తమకంటూ అక్కడ మార్కెట్ ఏర్పరుచుకున్నారు.

    బాలీవుడ్ హీరోలు మాత్రం కనీస వసూళ్లు సాధించలేక చతికిలపడుతున్నారు. దీనికి ప్రధాన కారణం కంటెంట్. సౌత్ ఫ్లేవర్ బాలీవుడ్ జనాలకు బాగా ఎక్కేస్తుంది. కెజిఎఫ్, కాంతార, పుష్ప, ఆర్ ఆర్ ఆర్, కల్కి చిత్రాల సక్సెస్ వెనుక రీజన్ ఇదే. కాగా సౌత్ ఇండియాలో స్టార్ గా వెలిగిన తమన్నా.. సౌత్, నార్త్ చిత్రాల మధ్య ఉన్న వ్యత్యాసం తెలియజేసింది. ఈ మేరకు ఆమె ఆసక్తికర కామెంట్స్ చేసింది.

    ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్నాకు ఈ ప్రశ్న ఎదురైంది. తమన్నా మాట్లాడుతూ.. సౌత్ చిత్రాలు ప్రధానంగా హ్యూమన్ ఎమోషన్స్ ఆధారంగా రూపొందుతున్నాయి. అమ్మానాన్నల ప్రేమ, అమ్మానాన్నల రివేంజ్, అన్నదమ్ముల ప్రేమ… ఇలా మానవ సంబంధాలు ప్రధానంగా సినిమాలు ఉంటాయి. వాళ్ళు చెప్పాలనుకున్నది సూటిగా చెప్పేస్తారు. అదే బాలీవుడ్ సినిమాలు… అన్ని వర్గాల ఆడియన్స్ దృష్టిలో పెట్టుకుని సినిమాలు తీస్తున్నారు. ఈ క్రమంలో కంటెంట్ కిచిడీ అయిపోతుంది.

    ఈ మధ్య కాలంలో బాగా ఆడిన బాలీవుడ్ సినిమాలు చూస్తే ఈ విషయం మనకు అర్థం అవుతుంది. లాప్తా లేడీస్ నాకు చాలా బాగా నచ్చింది. సౌత్, నార్త్ చిత్రాల మధ్య వ్యత్యాసం ఇదే.. అన్నారు. ప్రస్తుతం తమన్నాకు తెలుగులో ఆఫర్స్ తగ్గాయి. ఆమె డిజిటల్ కంటెంట్ పై ఎక్కువ దృష్టి పెడుతుంది. చిత్రాలు, సిరీస్లు చేసేందుకు ఆసక్తి చూపుతుంది. నటుడు విజయ్ వర్మను తమన్నా ప్రేమిస్తున్న సంగతి తెలిసిందే. త్వరలో పెళ్లి చేసుకునే అవకాశం కలదు.