Prabhas Fauji: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రభాస్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే ఆయన చేసిన సినిమాలే ఆయనను చాలా గొప్పగా పరిచయం చేస్తూ ఉంటాయి. మరి ఇలాంటి సందర్భంలో ఆయన సినిమాల పట్ల తీసుకునే శ్రద్ధ గాని, ఆయన సినిమాల విషయంలో అనుసరిస్తున్న విధానాలు గాని సగటు ప్రేక్షకుడికి నచ్చే విధంగా ఉంటాయి. మరి మొత్తానికైతే ఆయన సినిమాలు ఎలాంటి సక్సెస్ లను సాధిస్తాయి అనేది తెలియాల్సి ఉంది. ఇక ఇప్పుడు ఆయన హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ అనే సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా తొందర్లోనే సెట్స్ మీదకి రాబోతుంది అనే వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇక సందీప్ వంగ తో చేస్తున్న స్పిరిట్ సినిమా కంటే ముందే ఈ సినిమాని సెస్ మీదకి తీసుకెళ్లి తొందరగా రిలీజ్ చేయాలని ఉద్దేశ్యంలో ప్రభాస్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇదిలా ఉంటే ఫౌజీ సినిమా దర్శకుడు అయిన హను రాఘవ పూడి గతంలో సీతారామం సినిమా చేసి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తో తనకంటూ ఒక మంచి మార్కెట్ ని క్రియేట్ చేసుకోవడమే కాకుండా తనను తాను స్టార్ డైరెక్టర్ గా కూడా ఎలివేట్ చేసుకున్నాడు. ఇక దాంతో ప్రభాస్ తో సినిమా చేసే అవకాశం కూడా వచ్చింది.
మరి మొత్తానికైతే ఈ సినిమాతో తను ఒక పెను ప్రభంజనాన్ని సృష్టించడానికి రెడీ అవుతున్నాడు. ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ హను రాఘవ పూడికి ఒక విషయంలో ఫోబియా ఉందట. ఆయనకు హెవీ వాటర్ ని చూస్తే కొంతవరకు భయం కలుగుతుందట. ఇది చిన్నప్పటి నుంచి ఉందని ఆయన ఒకానొక సందర్భంలో తెలియచేయడం విశేషం…
అందుకే ఎక్కువగా వాటర్ ఉండే ప్రదేశంలో షూటింగ్స్ కి పెట్టుకోరనే వార్తలైతే వస్తున్నాయి. నిజానికి ఫోబియా అనేది అందరికీ ఉంటుంది. ఒక్కొక్క విషయంలో ఒక్కో వ్యక్తికి ఇలాంటి ఫోబియా ఉండడం అనేది సర్వసాధారణం…ఈయనకి సముద్రపు వాటర్ ని చూస్తే ఫోబియా ఉంటుందని తెలుస్తుంది. మొత్తానికైతే ఈయన చేసే సినిమాల్లో ఒక ప్యూర్ లవ్ స్టోరీ అయితే ఉంటుంది.
ఇక ప్రభాస్ తో చేస్తున్న సినిమాలో కూడా లవ్ స్టోరీని ఆడ్ చేశాడా? లేదంటే యాక్షన్ ఎంటర్ టైనర్ గా సినిమా ఉండబోతుందా అనేది తెలియాల్సి ఉంది… ఇక ఈ సినిమాని తొందరగా ఫినిష్ చేసి రిలీజ్ చేయడానికి ఆయన సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది…