Tamannaah Bhatia : ఇండియా వైడ్ గా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ , క్రేజ్ ని సంపాదించుకున్న హీరోయిన్స్ లో ఒకరు తమన్నా భాటియా(Tammannah Bhatia). తెలుగు, తమిళ భాషల్లో ఒకప్పుడు ఈమె డేట్స్ కోసం స్టార్ హీరోలు సైతం ఎదురు చూసేవారు. కానీ ఇప్పుడు ఆమె ఎక్కువగా బాలీవుడ్ వైపు ఫోకస్ పెట్టింది. బాలీవుడ్ కి వెళ్లిన తర్వాత తమన్నా లో చాలా మార్పులు కనిపించాయి. సౌత్ ఇండస్ట్రీ లో ఉన్నన్ని రోజులు ఆమె రొమాంటిక్ సన్నివేశాలకు నో చెప్పేది, కానీ బాలీవుడ్ కి వెళ్లిన తర్వాత ఏకంగా అడల్ట్ రేటెడ్ సన్నివేశాల్లో నటించడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అంతే కాకుండా అక్కడ ఆమె విజయ్ వర్మ(vijay varma) అనే ప్రముఖ నటుడితో ప్రేమలో పడిన సంగతి మన అందరికీ తెలిసిందే. బాలీవుడ్ లో ఏ ప్రైవేట్ లో చూసినా వీళ్లిద్దరు కనిపించేవారు. కొన్ని సార్లు రొమాన్స్ చేస్తూ కూడా కెమెరాలకు చిక్కారు.
Also Read : అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే సినిమా చేయను అంటూ మొండికేస్తున్న అట్లీ..మళ్ళీ చిక్కుల్లో పడ్డ అల్లు అరుణ్ మూవీ!
అలా అయస్కాంతం లాగా ఒకరిని ఒకరు పట్టుకొని తిరిగే వీళ్లిద్దరికీ రీసెంట్ గానే బ్రేకప్ అయ్యింది అంటూ వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తమన్నా తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో విజయ్ తో కలిసి ఉన్న ఫొటోలన్నీ తొలగించి అభిమానులకు పరోక్షంగా విడిపోయాము అనే విషయాన్ని చెప్పకనే చెప్పింది. ఇకపోతే రీసెంట్ గానే ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ రవీనా టాండన్(Raveena Tandon) హోలీ ఈవెంట్ ని ఏర్పాటు చేసింది. ఈ ఈవెంట్ కి విజయ్ వర్మ తో పాటు, ఆమె తమన్నా ని కూడా ఆహ్వానించింది. ఎక్కడికి వెళ్లినా కలిసి వెళ్లే ఈ జంట, ఈ ఈవెంట్ లో మాత్రం విడివిడిగా కనిపించారు. దీంతో సోషల్ మీడియా లో ఇన్ని రోజులు వీళ్లిద్దరు విడిపోయారు అంటూ వస్తున్న వార్తలు రూమర్స్ కావు, అవి నిజమే అని ఈ ఒక్క సంఘటనతో తేలిపోయింది. విడివిడిగా వీళ్లిద్దరు కలిసి వస్తున్న వీడియోని ఈ ఆర్టికల్ చివర్లో మీరు చూడొచ్చు.
విజయ్ తో పెళ్ళికి తమన్నా సిద్దమే. ఇక పెళ్లికి ఏర్పాట్లు చేద్దాం అని అతనితో అన్నప్పుడు, మనకి సెట్ అవ్వదు, స్నేహితులంగానే ఉండిపోదాం అని అన్నాడట. దీంతో తమన్నా ఎంతో బాధకు గురై బ్రేకప్ చెప్పినట్టు తెలుస్తుంది. కేవలం విజయ్ తో పెళ్లి కోసమే ఆమె అనేక క్రేజీ ప్రాజెక్ట్స్ ని వదిలేసుకోవాల్సి వచ్చిందట. ఇప్పుడు మళ్ళీ ఆమె కెరీర్ పై ఫుల్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఆమె సంపత్ నంది దర్శకత్వం లో తెరకెక్కిన ‘ఓదెల 2’ చిత్రం తో మన ముందుకు రాబోతుంది. ఇందులో ఆమె లేడీ అఘోర గా కనిపించి ఆడియన్స్ ని సర్ప్రైజ్ కి గురి చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె ఆ ఒక్క సినిమానే చేసింది, కొత్త అవకాశాల కోసం ఎదురు చూస్తుంది, మరి ఆమెకు అవకాశాలు ఇచ్చే దర్శక నిర్మాతలు ఎవరో చూడాలి.
Also Read : ప్రీమియర్ షోస్ నుండి ‘కోర్ట్’ మూవీ ఇంత గ్రాస్ వసూళ్లు వచ్చాయా..నాని బ్రాండ్ ఇమేజ్ పవర్ మామూలుగా లేదుగా!