Court Movie : నాని(Natural Star Nani) హీరో గా నటించే సినిమాలకు మాత్రమే కాదు, ఆయన నిర్మాతగా వ్యవహరించే సినిమాలకు కూడా మంచి క్రేజ్ ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. నేడు విడుదలైన ‘కోర్ట్'(Court Movie) సినిమా అందుకు మరో ఉదాహరణ. ఈ సినిమాలో హీరో, హీరోయిన్ పేర్లు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలెవ్వరికీ తెలియదు. కానీ కేవలం నాని నిర్మాత అవ్వడం తో, ‘ఓహ్..నాని సినిమానా..?, అయితే కచ్చితంగా బాగానే ఉంటుందిలే’ అనే నమ్మకం తో టికెట్స్ బుక్ చేసుకుంటున్నారు ఆడియన్స్. విడుదలకు ఒక రోజు ముందు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు కొన్ని చోట్ల ప్రీమియర్ షోస్ ప్రదర్శించారు. ఈ షోస్ కి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇంతటి రెస్పాన్స్ ని బహుశా మేకర్స్ కూడా ఊహించి ఉండరు. మొదటి రోజు రావాల్సిన గ్రాస్ కేవలం ప్రీమియర్ షోస్ నుండి వచ్చింది.
Also Read : ‘హరి హర వీరమల్లు’ కి పోటీగా ‘జల్సా’ రీ రిలీజ్..పవన్ ఫ్యాన్స్ కి ఊహించని ట్విస్ట్ ఇచ్చిన అల్లు అరవింద్
ముందుగా కేవలం కొన్ని లిమిటెడ్ షోస్ తో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు పెట్టారు, కానీ ఆ లిమిటెడ్ షోస్ కి టికెట్స్ హాట్ కేక్స్ లాగా అమ్ముడుపోవడంతో, షోస్ పెంచుకుంటూ వెళ్లారు. అలా రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 100 కి పైగా ప్రీమియర్ షోస్ షెడ్యూల్ అయ్యాయి. ఈ షోస్ నుండి దాదాపుగా 68 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయట. అదే విధంగా నార్త్ అమెరికా ప్రీమియర్ షోస్ లో ఈ సినిమాకి దాదాపుగా లక్షా 50 వేల డాలర్లు వచ్చాయట. ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా ఈ సినిమాకు రెండు కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు తెలుస్తుంది. నాని పేరు లేకుండా ఈ చిన్న సినిమా విడుదల అయ్యుంటే మొదటి రోజు మొత్తానికి కలిపి కూడా రెండు కోట్ల రూపాయిల గ్రాస్ వచ్చేది కాదు. అలాంటిది కేవలం ప్రీమియర్ షోస్ నుండి వచ్చిందంటే ఆయన బ్రాండ్ ఇమేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.
ఇక మొదటి రోజు ఓపెనింగ్ వసూళ్లు కూడా అదిరిపోయాయి. ప్రస్తుతం బుక్ మై షో లో ఈ చిత్రానికి గంటకు 7 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోతున్నాయి. దీనిని బట్టి బయట పాజిటివ్ టాక్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక చిన్న సినిమాకు ఈ రేంజ్ ట్రెండ్ ఉండడం సాధారణమైన విషయం కానే కాదు. ఊపు చూస్తుంటే కచ్చితంగా ఈ చిత్రం మొదటి రోజు డబుల్ డిజిట్ గ్రాస్ ని సాధించే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు. అదే నిజమైతే నిర్మాతగా నాని జాక్పాట్ కొట్టినట్టే. మరో రెండు నెలల్లో ఆయన హీరో గా నటించిన ‘హిట్ 3’ చిత్రం విడుదల అవుతుంది. ఈ సినిమాకి కూడా ఆయనే నిర్మాత. ఇక ఈ చిత్రానికి టాక్ వస్తే ఏ రేంజ్ వసూళ్లు వస్తాయో మీరే ఊహించుకోండి.
Also Read : అకీరా, ఆద్య పవన్ కళ్యాణ్ తో ఏ భాషలో మాట్లాడతారో తెలుసా? కూతురి కోసం ఆ లాంగ్వేజ్ నేర్చుకున్న పవర్ స్టార్