Malavika Mohan
Malavika Mohan: ప్రభాస్ దేశంలోనే అతిపెద్ద స్టార్. ప్రభాస్ గత చిత్రం కల్కి 2898 AD వరల్డ్ వైడ్ రూ. 1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. బాహుబలి 2 అనంతరం పరాజయాలు చవి చూసిన ప్రభాస్.. సలార్, కల్కి చిత్రాలతో సక్సెస్ ట్రాక్ ఎక్కారు. ఆయన లైన్ అప్ చాలా క్రేజీగా ఉంది. దర్శకుడు మారుతీతో రాజాసాబ్ చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. సమ్మర్ కానుకగా విడుదల కానుంది. అలాగే సీతారామం ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వంలో పౌజీ చిత్రం చేస్తున్నారు.
పౌజీ రెండవ ప్రపంచ యుద్ధం నేపథ్యంలో తెరకెక్కుతున్నట్లు సమాచారం. లవ్ అండ్ ఎమోషనల్ వార్ డ్రామా అని వినికిడి. మరోవైపు సందీప్ రెడ్డి వంగతో చేయాల్సిన స్పిరిట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఈ చిత్రంలో ప్రభాస్ ని మరింత వైలెంట్ గా ప్రజెంట్ చేస్తానని సందీప్ రెడ్డి వంగ ఫ్యాన్స్ కి హామీ ఇచ్చాడు. అలాగే కల్కి 2, సలార్ 2 కూడా ప్రభాస్ పూర్తి చేయాల్సిన సినిమాల జాబితాలో ఉన్నాయి.
ఇదిలా ఉండగా రాజాసాబ్ లో ఒక హీరోయిన్ గా నటిస్తున్న మాళవిక మోహన్ ప్రభాస్ ని ఉద్దేశిస్తూ ఆసక్తికర కామెంట్స్ చేసింది. సెట్స్ లో ప్రభాస్ ప్రవర్తన చూసి ఆశ్చర్యపోయాను. అంత పెద్ద స్టార్ హీరో అలా చేస్తారని ఊహించలేదని ఆమె అన్నారు. ఆమె మాట్లాడుతూ.. రాజాసాబ్ సెట్స్ లో ప్రభాస్ ని చూసి నేను ఆశ్చర్యపోయాను. అంత పెద్ద స్టార్ నార్మల్ గా, సపోర్టివ్ గా ఉండటం, సెట్ లో అందరితో కలిసిపోవడం చూసి నేను షాక్ అయ్యాను.
సెట్ లో ప్రభాస్ సరదాగా ఉంటారు. అందరికీ మంచి భోజనం అందిందా లేదా? అని తెలుసుకోవడం, బిర్యానీ దగ్గరుండి తినిపించడం వంటివి చేస్తారు. నిజంగా ప్రభాస్ చాలా స్వీట్, అని అన్నారు. ఇక తనతో పని చేసే హీరోయిన్స్ కి అరుదైన వంటకాలతో ట్రీట్ ఇవ్వడం ప్రభాస్ కి అలవాటు. పౌజీ హీరోయిన్ ఇమాన్వి కి సైతం తన ఆతిథ్యం రుచి చూపించాడు ప్రభాస్. ప్రభాస్ నిజంగా భోళా శంకరుడు అనడంలో సందేహం లేదు. కాగా రాజాసాబ్ మూవీ ఏప్రిల్ 10న విడుదల కానుంది.