Tamanna Do You Wanna Partner: సౌత్ ఇండియా లో బిగ్గెస్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్స్ లో ఒకరు తమన్నా భాటియా(Tamannah Bhatia). తెలుగు, తమిళ ఇండస్ట్రీస్ లో దాదాపుగా అందరి స్టార్ హీరోలతో కలిసి నటించిన తమన్నా కి హీరోయిన్ గా ఎన్నో సూపర్ హిట్స్, బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. కేవలం అందంతోనే కాకుండా తన నటన,డ్యాన్స్ తో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది ఈమె. అయితే ఒకప్పటి తమన్నా ని, ప్రస్తుత తమన్నా ని పోల్చి చూస్తూ ఆమె అభిమానులు చాలా బాధపడుతున్నారు. ఒకప్పుడు తమన్నా రొమాంటిక్ సన్నివేశాలు చేయడానికి ససేమీరా ఒప్పుకునేది. కథ పెద్ద రేంజ్ లో డిమాండ్ చేస్తే ముద్దు సన్నివేశాలకు ఒప్పుకునేది. అది కూడా లిప్ లాక్స్ కాదు. అలాంటి తమన్నా ఇప్పుడు బాలీవుడ్ లోకి వెళ్లిన తర్వాత గతంలో ఆమె పెట్టుకున్న హద్దులు మొత్తం చెరిపేసుకుంది.
ఇప్పుడు బాలీవుడ్ లో ఆమె అడల్ట్ రేటెడ్ కాంటెంట్స్ తప్ప మామూలు కంటెంట్ సినిమాల్లో నటించడం లేదు. ముఖ్యంగా ఆమె ‘ది లస్ట్ స్టోరీస్ 2’ లో తన మాజీ ప్రేమికుడు విజయ్ వర్మ తో కలిసి చేసిన రొమాన్స్ ఏ రేంజ్ సెన్సేషనల్ టాపిక్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. దానిని రొమాన్స్ అని కూడా అనలేము, అంతకు మించి అనే చెప్పాలి. కేవలం ఈ ఒక్క సినిమాతోనే ఆమె సరిపెట్టలేదు, జీ కర్దా అనే అడల్ట్ రేటెడ్ వెబ్ సిరీస్ కూడా చేసింది. ఇందులో ఆమె రొమాన్స్ హద్దులు దాటేశాయి, అంతే కాదు డైలాగ్స్ అయితే అసలు వినలేము. ఇవి చూసి ఎలా ఉండే తమన్నా, ఎలా అయిపోయింది అంటూ అబ్భిమానులు బాధపడ్డారు. రీసెంట్ గా జరిగిన ఇంటర్వ్యూస్ లో దీని గురించి ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం ఇదే ట్రెండ్ నడుస్తుంది కాబట్టి ఆడియన్స్ అభిరుచి కి తగ్గట్టుగా నేను కూడా మారాను అంటూ చెప్పుకొచ్చింది.
ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, నా మనసుకి నచ్చేవే చేస్తాను అనే విధంగా తమన్నా ముందుకు దూసుకుపోతుంది. అందులో భాగంగా లేటెస్ట్ గా ఆమె అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం ‘డు..యూ..వన్నా పార్టనర్’ అనే అడల్ట్ రేటెడ్ వెబ్ సిరీస్ చేసింది. సెప్టెంబర్ 12 నుండి ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఇది లెస్బియన్ లవ్ స్టోరీ అని అంటున్నారు. అడల్ట్ రేటెడ్ కంటెంట్ అని కూడా క్లారిటీ ఇచ్చారు. ఇందులో తమన్నా తో పాటు దియానా కూడా మరో లీడ్ రోల్ చేస్తుంది. చూడాలి మరి ఈ వెబ్ సిరీస్ తో తమన్నా ఏ రేంజ్ హీట్ ని పుట్టిస్తుంది అనేది.