Devi Sri Prasad : సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్లను వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు. అయితే ఒక సినిమా సక్సెస్ అనేది హీరోల మీద కాకుండా దర్శకుల మీద ఎక్కువగా డిపెండ్ అయి ఉంటుందన్న విషయం మనలో చాలామందికి తెలియదు.
నిజానికి ఒక సినిమా సక్సెస్ అవ్వాలంటే దానికి ఒక మంచి కథ ఉండాలి. దానికి దర్శకుడి యొక్క విజన్ కూడా తోడవ్వాలి అవి రెండూ ఉంటేనే సినిమా సక్సెస్ అవుతుంది. లేకపోతే మాత్రం సినిమా భారీగా డిజాస్టర్ ని మూటగట్టుకునే అవకాశాలైతే ఉన్నాయి. మరి ఇలాంటి సందర్భంలోనే ఒక సినిమా సక్సెస్ లో మ్యూజిక్ అనేది చాలా కీలకపాత్ర వహిస్తూ ఉంటుంది. అందుకోసమే మన దర్శకులు మ్యూజిక్ డైరెక్టర్లను ఎంచుకోవడంలో చాలావరకు కీలక పాత్ర వహిస్తూ ఉంటారు. ఎందుకు అంటే మ్యూజిక్ లో గాని బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో గానీ చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమైతే ఉంది. ఎందుకంటే ఈ రెండిటి వల్ల కూడా సినిమాలు చాలానే ఉన్నాయి. ప్రతి ప్రేక్షకుడు మ్యూజిక్ కి చాలా వరకు అట్రాక్ట్ అవుతూ ఉంటారు. ఒక సీన్ కి ఎలివేషన్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు బ్యా గ్రౌండ్ స్కోర్ కూడా కీలక పాత్ర వహిస్తుంది. కాబట్టి సినిమా సక్సెస్ అనేది మ్యూజిక్ మీద చాలా వరకు డిపెండ్ అయి ఉంటుంది
ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం తెలుగు, తమిళ్ అనే తేడా లేకుండా ఇండియా మొత్తంలో మ్యూజిక్ డైరెక్టర్లు గా కొనసాగుతున్న ఒక ముగ్గురి పేర్లు సినిమా ఇండస్ట్రీలో బాగా వినిపిస్తున్నాయి. ఇక వీళ్ళ రెమ్యూనరేషన్లు కూడా భారీ రేంజ్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది…ఇంతకీ వాళ్ళు ఎవరు ఒక్క సినిమాకి ఎంత తీసుకుంటున్నారు అనేది తెలుసుకుందాం…
దేవిశ్రీప్రసాద్
ఇప్పుడు సూపర్ సక్సెస్ మ్యూజిక్ ని అందించిన ఆయన ఇప్పుడు మాత్రం కొంతవరకు వెనకబడ్డారనే చెప్పాలి. మరి ఇలాంటి సందర్భంలో ఆయనకు పెద్ద సినిమా నుంచి పెద్దగా ఆఫర్లు అయితే రావడం లేదు. అయినప్పటికీ ఆయన భారీ రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆయన ఒక సినిమాకి దాదాపు 10 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి…
తమన్
ప్రస్తుతం స్టార్ హీరోలతో వర్క్ చేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్ గా తమ పేరు ప్రేక్షకులందరికి గుర్తిండి పోతుంది. ఇక ఆయన ఇచ్చే మ్యూజిక్ కొంతవరకు కాపీ అనే పేరు వచ్చినప్పటికి ప్రేక్షకుడిని మాత్రం ఎంగేజ్ చేస్తూ ఉంటుంది. కాబట్టి దర్శకుడు ఆయనకి ఎక్కువ అవకాశాలను ఇస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. ఇక ఆయన ఒక సినిమా కోసం దాదాపు 8 కోట్ల వరకు తీసుకుంటాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి…
అనిరుధ్
తమిళ్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును క్రియేట్ చేసుకున్న మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్…ప్రస్తుతం ఆయన ఇండియా వైడ్ గా చాలా వరకు ఫేమస్ అయ్యాడు. ఇక ఈయన ఒక సినిమాకి 12 నుంచి 15 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది…