Takkar Trailer Review: ఒకప్పటి లవర్ బాయ్ సిద్ధార్థ్ ప్రయోగాలు చేస్తున్నారు. విజయాల కోసం అన్ని రకాల సబ్జెక్ట్స్ ట్రై చేస్తున్నారు. ఆయన నటించిన లేటెస్ట్ మూవీ టక్కర్. యాక్షన్ క్రైమ్ డ్రామాగా తెరకెక్కింది. సిద్ధార్థ్ కంప్లీట్ డిఫరెంట్ అవతార్ లో కనిపిస్తున్నారు. ఎలాగైనా డబ్బులు సంపాదించాలనే ఓ పూర్ యంగ్ ఫెలోగా సిద్ధార్థ్ నటించారు. ధనవంతుడు కావాలనుకున్న ఆ యువకుడు ఎలాంటి దారి ఎంచుకున్నాడనేది టక్కర్ స్టోరీ. ట్రైలర్ లో మూవీ కథపై హింట్ ఇచ్చారు. రెండు నిమిషాలకు పైగా ఉన్న ట్రైలర్ ఆకట్టుకుంది.
సిద్ధార్థ్ లుక్ కంప్లీట్ డిఫరెంట్ గా ఉంది. ఆయన మేనరిజమ్స్ మెప్పిస్తున్నాయి. యాక్షన్ పాళ్ళు ఎక్కువగానే ఉంది. మాఫియా బ్యాక్ డ్రాప్ కూడా జోడించారు. అడల్ట్ కంటెంట్ కి కూడా కొదవలేదు. బెడ్ రూమ్, లిప్ లాక్ సన్నివేశాలలో సిద్దార్థ్ రెచ్చిపోయి నటించాడు. దివ్యాన్ష కౌశిక్ హీరోయిన్ గా నటించింది. ఆమెతో సిద్దార్థ్ బోల్డ్ సన్నివేశాలు సెగలు పుట్టిస్తున్నాయి. మొత్తంగా క్రైమ్, సస్పెన్స్, రొమాన్స్, యాక్షన్ అంశాలు జోడించి టక్కర్ తెరకెక్కించారు.
టక్కర్ చిత్రానికి కార్తీక్ జి క్రిష్ దర్శకుడు. తెలుగులో టీవీ విశ్వప్రసాద్ విడుదల చేస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో అందుబాటులోకి రానుంది. టక్కర్ చిత్రానికి నివాస్ కే ప్రసాద్ మ్యూజిక్ అందించారు. యోగిబాబు కీలక రోల్ చేశారు. జూన్ 9న టక్కర్ విడుదల కానుంది. ట్రైలర్ ఆకట్టుకున్న నేపథ్యంలో అంచనాలు పెరిగాయి.
గతంలో సిద్ధార్థ్ కి తెలుగు,తమిళ భాషల్లో మంచి మార్కెట్ ఉండేది. ఆయన డైరెక్ట్ తెలుగు చిత్రాలతో బ్లాక్ బస్టర్స్ కొట్టారు. సిద్ధార్థ్ నటించిన నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు బాక్సాఫీస్ షేక్ చేశాయి. ఒక దశలో తెలుగులో వరుసగా చిత్రాలు చేశారు. పరాజయాల శాతం ఎక్కువ కావడంతో సిద్ధార్థ్ మార్కెట్ కోల్పోయాడు. చివరిగా ఆయన తెలుగులో నటించిన చిత్రం మహా సముద్రం. శర్వానంద్ హీరోగా నటించిన ఈ చిత్రంలో సిద్ధార్థ్ నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ చేశారు. మరి టక్కర్ ఆయనకు ఎలాంటి ఫలితం ఇస్తుందో చూడాలి.