https://oktelugu.com/

టబు సెమీ న్యూడ్ గా.. నిజమేనా ?

సీనియర్ హీరోయిన్ ‘టబు’ అంటేనే గ్లామర్ డాల్. వయసు అయిపోయినా.. ఇప్పటికి ఆమెలో గ్లామరే కాదు, ఆమెలోని ఆ బిగువు ఆ పట్టు కూడా ఏ మాత్రం తగ్గలేదు. అవకాశం రావాలే గానీ, బికినీ వేయడానికి కూడా తాను రెడీ అని చెప్పింది ఈ మధ్య ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో. అందుకే మేకర్స్ కూడా టబు ఉత్సాహాన్ని చూసి ఆమె కోసం హాట్ హాట్ రోల్స్ రాస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ లో తెరకెక్కనున్న ఓ సిరీస్ తాజాగా […]

Written By: , Updated On : July 4, 2021 / 06:36 PM IST
Follow us on

Tabuసీనియర్ హీరోయిన్ ‘టబు’ అంటేనే గ్లామర్ డాల్. వయసు అయిపోయినా.. ఇప్పటికి ఆమెలో గ్లామరే కాదు, ఆమెలోని ఆ బిగువు ఆ పట్టు కూడా ఏ మాత్రం తగ్గలేదు. అవకాశం రావాలే గానీ, బికినీ వేయడానికి కూడా తాను రెడీ అని చెప్పింది ఈ మధ్య ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో. అందుకే మేకర్స్ కూడా టబు ఉత్సాహాన్ని చూసి ఆమె కోసం హాట్ హాట్ రోల్స్ రాస్తున్నారు.

అమెజాన్ ప్రైమ్ లో తెరకెక్కనున్న ఓ సిరీస్ తాజాగా టబు దగ్గరకు వచ్చింది. కథ విని తానూ హీరోయిన్ గా నటించడానికి రెడీ అంటూ ఆ సిరీస్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. అయితే ఈ సిరీస్ చాలా బోల్డ్ గా ఉండబోతుందని టాక్. హద్దు మీరు మరీ మెయిన్ గా యూత్ ను టార్గెట్ చేస్తూ ఈ సిరీస్ ను తీయనున్నారు. కొన్ని సన్నివేశాల్లో టబు సెమీ న్యూడ్ గా కనిపించాల్సి వస్తోందట.

మొత్తానికి టబు వైవిధ్యమైన శృంగార భరిత కథలో తన రసికతను మరోసారి సక్సెస్ ఫుల్ గా ప్రదర్శించడానికి సన్నద్ధం అవుతుంది అన్నమాట. ఇక టబు ప్రస్తుతం రెండు హిందీ చిత్రాలలో కీలక పాత్రలో నటిస్తోంది. అయితే వీటిలో ఓ సినిమాలో ఆమె హీరోకి అత్తగా నటించబోతుంది. ఆ హీరో కార్తీక్ ఆర్యన్. అనుకోని పరిస్థితుల్లో అల్లుడితో ప్రేమలో పడే పాత్ర ‘టబు’ది అట.

అయినా లేటు వయసులో ఘాటు పాత్రలు ఏమిటి టబు ? అదీ బరితెగించిన కథలలో కీలక పాత్రలు ఏమిటి ? అంటూ టబును అడుగుతున్నారు నెటిజన్లు. అయినా వయసు ఎంత అయితే ఏమి.. టబుకి ఇంకా పెళ్లి కాలేదు. ఎలాంటి పాత్రలు చేసినా.. అది ఆమెకు నచ్చినట్టు చేసుకోవచ్చు. ఎవరికీ సంజాయిషీ చెప్పక్కర్లేదు. అందుకే టబు రెచ్చిపోతుంది.