ఫిలిప్పీన్స్ సైనిక విమానం కూలిన ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య 29కి పెరిగింది. మండిన శకలాల నుంచి ఇప్పటి వరకు 50 మందిని రక్షించారు. సహాయక చర్యలు కొనసాగతున్నాయని రక్షణ శాఖ కార్యదర్శి డెల్పిన్ లోరోంజానా తెలిపారు. ముగ్గురు ఫైలట్లు, ఐదుగురు సిబ్బంది సహా 92 మందితో బయలుదేరిన ఈ విమానం సులు ప్రావిన్స్ లోని జోలో దీవిలో ల్యాండ్ అవుతున్న సమయంలో కుప్పకూలింది.