Taapsee Pannu : “మీరు ప్రేమలో ఉన్నారట కదా.. పెళ్లి కూడా చేసుకోబోతున్నారట కదా.. ఇంతకీ మీ మనసుకు దగ్గరైన ఆ వ్యక్తి ఎవరు? దీనిపై బాలీవుడ్ సినీ సర్కిల్ లో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి కదా.. ఏం సమాధానం చెబుతారంటూ” మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తే.. బాలీవుడ్ నటి తాప్సీ పన్ను తోక తొక్కిన తాచులాగా లేచింది. అగ్గి మీద గుగ్గిలమై మీడియా ప్రతినిధులను తిట్టింది. “నా గురించి ఏది పడితే అది మాట్లాడతారా. నేను నోరు విప్పితే చాలు ఇష్టం వచ్చినట్టు రాస్తారా.. నా వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడితే ఊరుకోను. రాస్తే మర్యాదగా ఉండదు. ఇకపై నా వ్యక్తిగత విషయాల గురించి ఎప్పుడూ మాట్లాడబోనంటూ” తాప్సి ఆగ్రహం వ్యక్తం చేసింది.. కానీ అవన్నీ ఉత్తివేనని.. తెరమీద కాదు.. తెర ముందు కూడా ఆమె నటించిందని స్పష్టమైంది.
రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఝుమ్మంది నాదం అనే సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన తాప్సి పెళ్లికూతురయింది. తను 10 సంవత్సరాలుగా ప్రేమిస్తున్న డెన్మార్క్ బ్యాడ్మింటన్ ఆటగాడు “మథియస్ బో” ను రహస్యంగా పెళ్లి చేసుకుంది. బాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయపూర్ ప్రాంతంలో తాప్సి, మథియస్ వివాహం చేసుకున్నట్టు తెలుస్తోంది. మార్చి 23న కేవలం వారిద్దరికీ చెందిన కుటుంబాలు, అతి దగ్గర మిత్రులు మాత్రమే ఈ వివాహానికి హాజరైనట్టు ప్రచారం జరుగుతున్నది.. తన పెళ్లి రహస్యంగా జరగాలని.. హడావిడి ఉండకూడదనే భావించే తాప్సి ఎవరికీ ఆహ్వానాలు పంపించలేదని సమాచారం. తాప్సి తనతో పనిచేసే పవైల్ గులాటి, కనికా థిల్లాన్, అనురాగ్ కశ్యప్ వంటి వారు మాత్రమే ఈ పెళ్లికి హాజరైనట్టు తెలుస్తోంది.
ఇక ఇటీవల కనిక ఇన్ స్టా గ్రామ్ లో కొన్ని ఫోటోలు పోస్ట్ చేసింది. ఆ పోస్టుకు “మేరే యార్ కీ షాదీ” అంటూ యాష్ ట్యాగ్ యాడ్ చేసింది. మరోవైపు పవైల్ కూడా తాప్సి సోదరి షగ్ను పన్నుతో పాటు మరికొందరితో దిగిన గ్రూప్ ఫోటోను షేర్ చేశాడు. “ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్.. మేము ఎక్కడున్నామో తెలియదు యార్” అంటూ రాస్కొచ్చాడు. ఇవన్నీ చూసిన నెటిజన్లు తాప్సికి పెళ్లయిందనే అంచనాకు వచ్చారు.
తాప్సి ఝుమ్మంది నాదం అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. మిస్టర్ ఫర్ఫెక్ట్, షాడో, వీర వంటి సినిమాలో నటించింది. తెలుగులో ఆశించినంత స్థాయిలో గుర్తింపు రాకపోవడంతో బాలీవుడ్ వెళ్ళిపోయింది. అక్కడ స్టార్ నటించి సందడి చేసింది. తెలుగులో వకీల్ సాబ్ మాతృక అయినా హిందీ పింక్ లో నటించి మెప్పించింది. కొన్ని వెబ్ సిరీస్ లలోనూ తాప్సి నటించి మెప్పించింది.
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: Taapsee pannu and mathias boe are married in udaipur
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com