
తక్కువ కాలంలోనే ఎక్కువ క్రేజ్ సాధించిన హీరోయిన్ గా తాప్సీ బాలీవుడ్ లో తనను తానూ బాగా ప్రమోట్ చేసుకుంటూ ఉంటుంది. మొదట టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి, ఇక్కడ స్టార్ డమ్ సంపాధించలేకపోయిన ఈ ముద్దు గుమ్మ, బాలీవుడ్ ను మాత్రం ఒక ఊపు ఉపేస్తోందని, వరుస అవకాశాలను దక్కించుకుంటున్నానని చెబుతుంది. మరి ఇలాంటి విషయాలను తాప్సి ఇప్పటికే చాలాసార్లు చెప్పింది.
కానీ, ఆమెకు మాత్రం బాలీవుడ్ లో చిన్నాచితకా చిత్రాలు తప్పా, ఇంతవరకు ఒక్క పెద్ద ఛాన్స్ కూడా రాలేదు. అయితే తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన ప్రియుడు ‘మథియాస్’తో ప్రేమ, పెళ్లి గురించి కొత్త విషయాలు చెప్పుకొచ్చింది. కెరీర్ మొదట్లో చిత్ర పరిశ్రమకు చెందిన ఓ వ్యక్తితో తానూ ప్రేమ కార్యకలాపాలను సాగించానని నా పై అనేక పుకార్లు పుట్టించారు.
వాటిల్లో ఎలాంటి వాస్తవం లేదు. నేనెప్పుడు వృత్తిగత, వ్యక్తిగత విషయాలను వేర్వేరుగా చూస్తాను. అందుకే నా పై ఎన్ని రూమర్స్ వచ్చినా.. నేను ఏ నాడు ఫీల్ అవ్వలేదు. అయితే నేను ప్రస్తుతం ప్రేమలో ఉన్నాను అంటూ తన ప్రియుడు గురించి చెప్పింది. తన ప్రియుడు ‘మథియాస్ బో’ తనకు ఎంతో సపోర్ట్ చేస్తాడని, తనను బాగా అర్ధం చేసుకుంటాడని తాప్సి మురిసిపోతూ సెలవిచ్చింది.
పనిలో పనిగా తన పెళ్లి ముచ్చట్లను కూడా చెబుతూ.. ఇంట్లో పెళ్లి చేసుకోమని తొందర పెడుతున్నారు. కానీ, ఇండస్ట్రీలో కెరీర్ పరంగా నేను సాధించాల్సిన కలలెన్నో ఉన్నాయి. నా కలలను నెరవేర్చుకోవడం పైనే ప్రస్తుతం నా ఆలోచనలన్నీ ఉన్నాయి. అందుకే పెళ్లి గురించి ఇప్పట్లో నేను ఏ నిర్ణయం తీసుకో దలచుకోలేదు. నేను అనుకున్న స్థాయికి ఎప్పుడు చేరుకుంటానో అప్పుడు పెళ్లి చేసుకుంటాను అంటూ ఈ ముద్దుగుమ్మ చెప్పుకొచ్చింది.