
కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఆగిపోయిన సినిమా షూటింగ్ లకు మహారాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గత కొన్ని రోజులుగా కరోనా కేసులు గణనీయంగా తగ్గుతున్న నేపథ్యంలో సినిమా షూటింగ్ లకు అనుమతి ఇస్తున్నట్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే తెలిపారు. ఆదివారం చిత్ర పరిశ్రమ వర్గాల ప్రతినిధులతో వర్చువల్ గా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కరోనా నియంత్రణలో ప్రభుత్వానికి సహకరించాలని ఈ సందర్భంగా ఉద్ధవ్ కోరారు.