
కరోనా మహమ్మారి కట్టడికి కోసం తెలంగాణ రాష్ట్రంలో కొవిడ్ వ్యాక్సినేషన్ జోరుగా కొనసాగుతోంది. తాజాగా బన్సీలాల్ పేట్ లో మొబైల్ మెడికల్ వ్యాన్ ను సీఎస్ సోమేశ్ కుమార్ ప్రారంభించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు వృద్ధులు, దివ్యాంగులకు స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టినట్లు సీఎస్ తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో 24 మొబైల్ మెడికల్ వ్యాన్ల ద్వారా వ్యాక్సిన్లు పంపిణీ జరుగుతోందన్నారు.